Balayya : పక్కా మాస్ లుక్

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా NBK107. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అఖండ విజయం తర్వాత ఈ సినిమా వస్తున్న నేపథ్యంలో నందమూరి అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు ఆ అంచనాలను మరింత పెంచేలా ఉన్నాయి. అలాగే స్టోరీ కూడా అఖండ లాగే పాలిటిక్స్, యాక్షన్ తో పాటు కాస్త భక్తి కి సంబంధించిన సన్నివేశాలు కూడా ఉండేలా బాలయ్య జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

కాగా NBK107 ను ఈ ఏడాది చివరలో గానీ, వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా గానీ విడుదల చేయాలని మేకర్స్ రెడీ అవుతున్నారు. అందుకు అనుకులంగా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటున్నారు. ఇదిలా ఉండగా, నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ ఇండస్ట్రీకి వచ్చి నేటికి 48 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని ట్విట్టర్ వేదికగా ఒక ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు.

ఈ ఫోటోలో హీరో బాలయ్య తోపాటు హీరోయిన్ శ్రుతి హాసన్, డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఉన్నారు. బాలయ్య న్యూ లుక్ పక్కా మాస్ గా కనిపిస్తుంది. హెయిర్ స్టైల్, డ్రెస్ స్టైల్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ మాస్ లుక్ ను చూసిన నందమూరి అభిమానులు గాడ్ ఆఫ్ మాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు