Ayalaan: “అయలాన్” తెలుగు వర్షన్ కు ఊహించని ఎదురు దెబ్బ… షోలు క్యాన్సిల్

Ayalaan:  2024 రిపబ్లిక్ డే వీకెండ్ ను టాలీవుడ్ డబ్బింగ్ సినిమాలకు ఇచ్చేసిన విషయం తెలిసిందే. ఫైటర్ మూవీ ఒకరోజు ముందుగా రిలీజ్ కాగా, జనవరి 26న కెప్టెన్ మిల్లర్ తో పాటు అయలాన్ తెలుగు వెర్షన్ రిలీజ్ కావలసి ఉంది. ప్రస్తుతం “కెప్టెన్ మిల్లర్” థియేటర్లలో సందడి చేస్తుంటే, తెలుగు ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ “అయలాన్” తెలుగు వర్షన్ కు మాత్రం ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. బుకింగ్స్ కూడా పూర్తయిన “అయలాన్” మార్నింగ్ షోలు, నూన్ షోలు సడన్ గా క్యాన్సిల్ కావడంతో ప్రేక్షకులకు ఊహించని షాక్ తగిలింది. ఇంతకీ “అయలాన్” తెలుగు వెర్షన్ అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోవడానికి కారణం ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ “అయలాన్”. ఆర్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఇప్పటికే తమిళంలో సంక్రాంతి కానుకగా రిలీజై, వసూళ్ల పరంగా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ మూవీ తమిళనాడుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 75 కోట్లు కలెక్ట్ చేసి 100 కోట్ల దిశగా వెళ్తుంది. జనవరి 12న “అయలాన్” తమిళంలో రిలీజ్ కాగా, తెలుగు వెర్షన్ ను కూడా ఆ సమయంలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ టాలీవుడ్ స్టార్ హీరోలు సంక్రాంతి రేసులో దిగడం, థియేటర్లు దొరకపోవడం వల్ల “అయలాన్” వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దీంతో తమిళంలో అయితే అనుకున్న సమయానికి రిలీజ్ చేయగలిగారు కానీ, తెలుగులో వాయిదా వేయాల్సి వచ్చింది.

ఈ క్రమంలోనే “అయలాన్” మూవీ తెలుగు రైట్స్ ను కొనుగోలు చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిపబ్లిక్ డేపై కన్నేశారు. జనవరి 26న తెలుగు సినిమాలేవీ రిలీజ్ కాకపోవడంతో “అయలాన్” మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని ప్రకటించారు. ఈ అనౌన్స్మెంట్ ప్రకారం తెలుగు ప్రేక్షకులు కూడా “అయలాన్” తెలుగు వెర్షన్ ను జనవరి 26న థియేటర్లలో చూడొచ్చని ఫిక్స్ అయిపోయారు. అలా టికెట్లు కూడా అమ్ముడైపోయాక అసలు ట్విస్ట్ బయటపడింది.

- Advertisement -

ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని “అయలాన్” థియేటర్లలోకి అడుగుపెట్టిన ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు. ఈ మూవీ మార్నింగ్, మధ్యాహ్నం షోలు క్యాన్సిల్ అయ్యాయని తెలియజేస్తూ రీఫండ్ మెసేజ్ లు రావడంతో షాక్ అవుతున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమస్యల కారణంగా చివరి నిమిషంలో షోలు క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందని సమాచారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా “అయలాన్” షోలు పడే అవకాశం లేదు. రిపబ్లిక్ డే సెలవు దినం కావడంతో ఈరోజు కోర్టులతో సహా అన్ని కార్యకలాపాలకు బంద్.

అందుకని ఈ సినిమా సమస్యను పరిష్కరించడానికి ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్లు ఎంత ప్రయత్నించినా సమస్య పరిష్కారం కాలేదని, ఎప్పుడు సమస్య సాల్వ్ అవుతుందో కూడా తెలియదని టాక్ నడుస్తోంది. అయితే “అయలాన్”కు ఎదురైన ఈ సమస్య ఈ మూవీకి పోటీగా రిలీజ్ అయిన “కెప్టెన్ మిల్లర్”కు అడ్వాంటేజ్ కాబోతోంది.

నిజానికి జనవరి 12న తమిళంలో ఒకేసారి విడుదలైన “అయలాన్”, కెప్టెన్ మిల్లర్ సినిమాలలో “కెప్టెన్ మిల్లర్” కు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ తెలుగు వర్షన్ విషయంలోకి వచ్చేసరికి “అయలాన్” దిల్ రాజు చేతిలో పడడంతో “కెప్టెన్ మిల్లర్” కంటే ఈ సినిమాకే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్లను కేటాయించారు. అయినప్పటికీ ప్రస్తుతం ఎదురైన సమస్య కారణంగా “అయలాన్” షోలు పడకపోవడంతో “కెప్టెన్ మిల్లర్” నిరాటంకంగా థియేటర్లలో దూసుకెళ్తున్నాడు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు