AVS Daughter: తండ్రి కోసం అంత త్యాగం చేసిన ఏవీఎస్ కూతురు.. కానీ..!

తెలుగు తెరపై అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కమెడియన్స్ లో ఏవీఎస్ కూడా ఒకరు.. ఈయన అసలు పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం.. అద్భుతమైన డైలాగులు డెలివరీతో హావభావాలతో పాత్రను పండించే ఆడియన్స్ కు నవ్వులు పంచేవారు. మొదట తెనాలిలో పౌరోహిత్యం చేసిన ఏవీఎస్ ఆ తర్వాత విజయవాడలో విలేఖరిగా కూడా పనిచేశారు.. అయితే అదే సమయంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని.. తినడానికి తిండిలేక పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కాదు.. ఆకలిని అదుపు చేసుకునేందుకు కిల్లీ నమిలేవారట.. డబ్బుల కోసం తనకు తెలిసిన విద్య మిమిక్రీ షో చేస్తూ.. పొట్ట నింపుకున్నట్లు సమాచారం..

ఇకపోతే అలాగే ఒక ప్రదర్శనలో దిగ్గజ దర్శకుడు బాపు.. ఏవీఎస్ ను చూసి “మిస్టర్ పెళ్ళాం” సినిమాలో అవకాశం ఇచ్చారు.. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో సహాయక పాత్రలో నటించి మెప్పించిన ఈయన.. తన సినీ ప్రస్థానంలో దాదాపు 750 కి పైగా సినిమాలలో నటించి దిగ్గజ హాస్యనటులుగా పేరు దక్కించుకున్నారు. ఇక ఈయన నటించిన కొన్ని చిత్రాల విషయానికొస్తే.. జయం మనదేరా, సిసింద్రీ , యమలీల, మాయలోడు, ఆవిడ మా ఆవిడే, ఘటోత్కచుడు , అదిరిందయ్యా చంద్రం, యమగోల మళ్ళీ మొదలైంది, రాధాగోపాలం, సంక్రాంతి, కాశీ ఇలా ఎన్నో సినిమాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి.

డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా కూడా తన అభిరుచి చాటుకున్నారు. ఒక సినిమాలలోనే కాదు తెలుగుదేశం పార్టీలో కూడా చేరి పార్టీ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు. అంతేకాదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా) జనరల్ సెక్రటరీగా కూడా అప్పట్లో ఎన్నికయ్యారు. ఇకపోతే సినిమాల ద్వారా ఎంతో పేరు దక్కించుకున్న ఈయన 2008లో కాలేయం చెడిపోయి పూర్తి అనారోగ్యానికి గురయ్యారు.. ఈ సమయంలోనే ఆయన కూతురు ప్రశాంతి ఒక కిడ్నీ ఇవ్వగా.. 2008లో ఈయనకు కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. ఇక తండ్రి ఏవీఎస్ కు కాలేయం దానం చేసిన ఈమె తన తండ్రి పై ఉన్న ప్రేమను చాటుకుంది. కొన్నాళ్లు కూతురి ఇచ్చిన కిడ్నీ తో కాలం వెళ్లదీసిన ఏవీఎస్ కు మళ్లీ వ్యాధి తిరగబడడంతో 2013లో స్వర్గస్తులయ్యారు.. ఇకపోతే ఏవీఎస్ అల్లుడు( ప్రశాంతి భర్త )కూడా నటుడే.. ఆయన పేరు శ్రీనివాస్ దావగుడి..చింటూ అని ఇండస్ట్రీలో అందరూ పిలుస్తూ ఉంటారు. ఈయన ఎక్కువగా రవిబాబు సినిమాలలో నటించారు. ” అవును “సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి తన నటనతో విపరీతంగా ఆకట్టుకున్నారు.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు