Avatar: The Way of Water : కలెక్షన్ల సునామికి మార్గం

అవతార్ సినిమా గురించి తెలియని సినీ ప్రేమికుడు, సినీ ప్రేక్షకుడూ ఉండడు. ప్రపంచ బాక్సాఫీస్‌ను కుదిపేసిన సినిమా అవతార్. అంతకు ముందు టైటానిక్ పేరు మీదున్న రికార్డులను అవతార్ సినిమా చెరిపేసింది అని చెప్పొచ్చు. కేవలం అవార్డుల పరంగానే కాకుండా, కలెక్షన్ల పరంగా కూడా అవతార్ సినిమా ఎప్పటికీ చెరిగిపోని రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఫస్ట్ పార్ట్ వచ్చిన తర్వాత డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ దీనికి సీక్వెల్స్ కూడా ఉంటాయని ప్రకటించారు. అవతార్ సిరీస్ ను క్రియేట్ చేస్తున్నాట్టు అనౌన్స్ చేశాడు. అప్పటి నుంచి అవతార్ సీక్వెల్ కోసం సినీ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది.

ఫస్ట్ పార్ట్ వచ్చిన పదమూడేళ్ల తరువాత సెకండ్ పార్ట్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఫస్ట్ పార్ట్ ను దట్టమైన అడవిలో తెరకెక్కించిన జేమ్స్.. సెకండ్ పార్ట్ ను అండర్ వాటర్‌లో రూపొందించాడు. “అవతార్: ది వే ఆఫ్ వాటర్” అనే టైటిల్ ను కూడా పెట్టాడు. ఇప్పటికే వచ్చిన టీజర్ తో మొదటి భాగం కంటే భారీగా ఉంటుందని ప్రూవ్ చేసింది. తాజాగా బుధవారం ట్రైలర్ కూడా రిలీజ్ అయింది.

సూపర్ విజువల్ వండర్ గా ఉన్న “అవతార్: ది వే ఆఫ్ వాటర్” ఆధ్యాంతం ఆకట్టుకుంటుంది. సినీ ప్రేమికులకు కావాల్సినంత అవతార్ 2 లో ఉందని ట్రైలర్ తో జేమ్స్ చెప్పేశాడు. అండర్ వాటర్ లో వచ్చే ప్రతి సీన్ ప్రేక్షకుడిని సీటుకు కట్టేస్తోంది. ఈ సెకండ్ పార్ట్ క్రియేట్ చేసే రికార్ట్స్ అంతా ఇంతా ఉండవని ఈ ట్రైలర్ తో అర్థమవుతుంది. కాగా అవతార్: ది వే ఆఫ్ వాటర్ ఈ ఏడాది డిసెంబర్ 16న దాదాపు 160 భాషలలో రిలీజ్ కానుంది.

డిసెంబర్ 16 తర్వాత అవతార్: ది వే ఆఫ్ వాటర్ స్రుష్టించే సృష్టించే కలెక్షన్ల సునామి ఎంత ఉంటుందో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు