actress: ” స్వాగ్ ” చూపిస్తున్న మరో యాక్ట్రెస్.. ఆమె ఎవరంటే..!

actress: టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న తాజా చిత్రం స్వాగ్. ఇక ఈ మూవీ ని ఇటీవల అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని హసిత్ గోలి డైరెక్ట్ చేస్తుండడంతో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ దక్కుతుంది.

కాగా తాజాగా ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతుంది. దీనికి తగ్గట్లు గానే సినిమా క్యాస్టింగ్ ను వరుసగా అనౌన్స్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాలో అందాల భామ రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తుందని.. మరో యాక్ట్రెస్ మీరా జాస్మిన్ ఓ కీలక పాత్ర పోషించబోతున్నట్లు మేకర్స్ పోస్టర్స్ ద్వారా వెల్లడించారు.

Another actress showing "swag".. who is she
Another actress showing “swag”.. who is she

కాగా ఈ మూవీలో మరో నటి కూడా నటించబోతున్నట్లు ఓ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో ఉన్న నటి మరెవ్వరో కాదు శరణ్య. అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ సినిమాతో సూపర్ హిట్ విజయం అందుకున్న శరణ్య ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించబోతుంది. ఇక ఈమె పోస్టర్ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు