Animal Movie: ఉన్నదానికంటే… ఉంచుకున్నదే బాగుంది కదా రెడ్డి

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తరం మారుతున్నకొద్దీ సినిమా రూపురేఖలు మారుతూ వచ్చాయి. ఒక మూస ధోరణిలో వెళ్తున్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీని శివ అనే సినిమా కొత్త మలుపుని తీసుకొచ్చింది. ఇదే విషయాన్ని చాలామంది చెబుతూ వస్తారు. ఆ సినిమా తర్వాత ఆ రేంజ్ లో ఇంపాక్ట్ చూపించిన సినిమా అంటూ ఇప్పటివరకు రాలేదు. అయితే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా మళ్లీ ఆ ఇంపాక్ట్ ను తీసుకొచ్చింది. అనేది కొంతమంది అభిప్రాయం.

ఒకే సినిమాతో ఎనలేని గుర్తింపును సాధించాడు. అందరి చూపుని తన వైపు తిప్పుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఆ సినిమా తెలుగులో అద్భుతమైన విజయాన్ని అందుకున్న తర్వాత హిందీలో కూడా రీమేక్గా తెరకెక్కి మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించడంతోపాటు అనేక ట్రోల్స్ ను కూడా ఎదుర్కొని అనేక నెగిటివ్ రివ్యూస్ ని ఫేస్ చేసింది. ఆ సినిమాను వైలెంట్ ఫిలిం అని కూడా కొంతమంది రివ్యూ రైటర్స్ బాలీవుడ్లో చెప్పుకొచ్చారు. వారందరికీ సమాధానంగా వైలెంట్ ఫిలిం అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తానంటూ సందీప్ రెడ్డి వంగా అనిమల్ సినిమాను తెరకెక్కించాడు.

అయితే అనిమల్ సినిమాలో రన్బీర్ కపూర్ సరసన రష్మిక మందన నటించింది. ఈ సినిమాలో ఒక సీన్ లో రష్మిక కాకుండా మరో అమ్మాయితో రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తుంటాడు రన్బీర్ కపూర్. అలానే అర్జున్ రెడ్డి సినిమాలో కూడా ప్రీతితో విడిపోయిన తర్వాత ఒక హీరోయిన్ తో రిలేషన్ పెట్టుకునే ప్రయత్నం చేస్తాడు అర్జున్. అయితే వీటి పైన ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. మెయిన్ లీడ్స్ కంటే సందీప్ రెడ్డి వంగ సెట్ చేసిన సెకండ్ సెటప్ లు బాగుంటారంటూ కొంతమంది సోషల్ మీడియా వేదిక తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది వాటికి ఏకీభవిస్తున్నారు కూడా. ఏదేమైనా ఉన్నదానికంటే ఉంచుకున్నదే బాగుంటుంది వంగా అంటూ కొన్ని మీమ్స్ కూడా మొదలయ్యాయి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు