త్రివిక్రమ్ శ్రీనివాస్,
అందరు మాట్లాడుతారు, కానీ ఈయన మాటలతో ఆడుకుంటాడు.
అక్షరాలను కాగితంపై అలవోకగా విసరగలడు, పదాలను పద్దతిగా తనకు నచ్చిన వరుసలో కూర్చోబెట్టగలడు. ఆత్రేయ , ముళ్ళపూడి , గణేష్ పాత్రో వంటి ఎందరో మహానుభావులుకి తన సొంత శైలిని కలిపి అతని పదాలు మిమిక్రి చేస్తాయి. కేవలం పోస్టర్ పై ఈయన పేరు చూసి సినిమాకి వెళ్లిన ప్రేక్షకులు ఎందరో ఉన్నారు.
రచయిత గానే కాకుండా, దర్శకుడిగా తనకంటూ ఒక ఇమేజ్ ను సాధించుకున్నత్రివిక్రమ్ కెరియర్ లో బెస్ట్ ఫిలిమ్స్ అంటే “అతడు” అని చెప్పొచ్చు. కానీ ఈ సినిమా థియేటర్ లో అనుకున్న స్థాయిలో ఆడలేదు. కానీ ఇప్పటికి టీవీ లో ఆ సినిమాకి ఉండే ఆదరణ వేరు. ఈ సినిమాని “జయభేరి ఆర్ట్స్” లో మురళి మోహన్ నిర్మించారు. త్రివిక్రమ్ కి దర్శకుడిగా ఇది రెండవ సినిమా.
మీ మాటలు బాగుంటాయి మీరు దర్శకుడిగా మాకొక సినిమా చెయ్యాలని త్రివిక్రమ్ ను మురళీమోహన్ అడిగినప్పుడు, నేను స్రవంతి రవి కిషోర్ గారికి మొదటి సినిమా చేస్తానని మాట ఇచ్చానండి, అది పూర్తి అయ్యాక మీకు రెండో సినిమా చేస్తానని చెప్పి అతడు చేసారు.
అతడు సినిమా అనుకున్న టైం లో తియ్యకపోవడం, అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ పెట్టడం వలన మురళీమోహన్ తీవ్రంగా నష్టబోయారని, ఆ తరువాత అందుకే మళ్ళీ మురళి మోహన్ సినిమాలు చెయ్యలేదని వార్తలు వినిపించాయి.
వీటిపై రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మురళిమోహన్ స్పందిస్తూ,
“అతడు” కథను విన్నప్పుడే ఈ సినిమా భారీ స్కేల్ లో ఉంటుందని తమకు అర్ధమైంది అని, 6 నెలలులో షూటింగ్ అయిపోతుంది అనుకుంటే దానికి సంవత్సరం పైన పట్టడం, దానివలన అనుకున్న దానికంటే బడ్జెట్ పెరిగిందని చెబుతూ, ఆ తరువాత రాజకీయాల్లోను , రియల్ ఎస్టేట్స్ లో బిజీగా ఉండటం వలన మళ్ళీ సినిమాలు చెయ్యలేదని చెప్పుకొచ్చారు.