Ananya nagalla: కెరీర్ ముగిసిందా… ఈ తెలుగు అమ్మాయి ఇక ఇన్‌స్టాకే పరిమితమా?

Ananya nagalla

టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉన్నారు. రీతూ వర్మ, అదితి రావు హైదరీ, శోభిత దూలిపాలతో పాటు ఇటీవల ఫేమస్ అయిన వైష్ణవి చైతన్య లాంటి వాళ్లు ఉన్నారు. కానీ, వీళ్లు తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హోదా తెచ్చుకోలేదు. ఇప్పటి వరకు స్టార్ హోద అనుభవిస్తున్న వాళ్లు అందరూ కూడా ఇతర రాష్టాల నుంచి వచ్చిన వాళ్లే. కానీ, తెలుగు భామలకు ఇక్కడ అవకాశాలు రావడం లేదు. ఒక వేళ వచ్చినా వీళ్లు తమను తము నిరూపించుకోవడం లేదు.

కొన్ని రోజుల క్రితం అనన్య నాగళ్ల అనే తెలుగు హీరోయిన్ ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఈమె నటించిన వకీల్ సాబ్ మూవీకి ఉత్తమ మహిళా అరంగేట్రం కోసం SIIMA అవార్డుకి కూడా నామినేట్ అయింది. దీని తర్వాత అనన్య టాలీవుడ్‌లో మంచి స్థానానికి వెళ్తుందని అందరూ అనుకున్నారు. కానీ, తీరా చూస్తే, ఇన్‌స్టాలో హాట్ హాట్ ఫోటోలు పెట్టడం, రెండు మూడు యాడ్స్ చేయడమే తప్పా.. సినిమాలేవీ కూడా చేయడం లేదు.

చిన్న చిన్న సినిమాలో సైడ్ క్యారెక్టర్లు చేస్తోంది. కానీ, హీరోయిన్ గా మాత్రం అవకాశాలు రావడం లేదు. ఇప్పుడు ఈమె బూట్‌కట్ బాలరాజు అనే సినిమాలో నటిస్తుంది అంటూ న్యూస్ వచ్చింది. కానీ, ఇప్పుడు దాని గురించి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. ఇలా అనన్య లైనప్ చూస్తే కెరీర్ ముగిసిపోయినట్టే కనిపిస్తోంది. ఇటీవల అనన్య తన ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన పోస్ట్ ల కింద కూడా నెటిజన్లు.. ఇక యాడ్స్ చేసుకోవడం, ఇలాంటి చిన్న చిన్న బట్టలు వేసుకుని ఫోటోలు పెట్టడమే నీ పని. ఇక సినిమాలు లేవు అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు.

- Advertisement -

కాగా, ఇటీవల అనన్య.. ఒక యాడ్ చేసింది. దీంట్లో ఎక్కడా కూడా తెలుగు ఉపయోగించలేదు. మొత్తం ఇంగ్లీష్ తోనే యాడ్ ని కానిచ్చేసింది. దీనిపై కూడా బాగా ట్రోల్స్ వచ్చాయి. తెలుగు హీరోయిన్ అయి ఉండి, ఇలాంటి యాడ్స్ చేస్తున్నావు, నీకు ఇక సినిమా ఛాన్స్ లు కూడా రావు అంటూ ట్రోల్స్ చేశారు నెటిజన్లు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు