Gam Gam Ganesha: సెన్సార్ పూర్తి చేసుకున్న ఆనంద్ మూవీ..‌ !

Gam Gam Ganesha: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఇండస్ట్రీలో ఇటీవలే మంచి పేరును సంపాదించుకున్నాడు. బేబీ సినిమాతో స్టార్ హీరో అయిపోయాడు ఆనంద్ దేవరకొండ. ఇక ఇటీవల ఆనంద్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ గమ్ గమ్ గణేశా నూతన దర్శకుడు ఉదయ్ శెట్టి ఈ మూవీని రూపొందించారు.

ఇక ఈ చిత్రంలో ప్రగతి శ్రీనివాస, కరిష్మా హీరోయిన్స్ గా నటించారు. అదేవిధంగా ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఆర్టిస్ట్ ఇమాన్యుయల్ కీలకపాత్రను పోషించారు. ఈ మూవీను హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగం శెట్టి, వంశీ నిర్మించారు. ఇక ఈ మూవీకి చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ అందించారు.

anands-movie-that-has-been-censored
anands-movie-that-has-been-censored

ఈ చిత్రం మే 31న గ్రాండ్గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక ఇదిలా ఉంటే ఈ మూవీ తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు యు/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. క్రైమ్ కామెడీ కథాంశం గా రూపొందిన ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి హైప్స్ ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు