Varalakshmi: వరుడును ప్రకటించింది పుకార్లకు చెక్ పెట్టింది

సీనియర్ నటుడు శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులు పరిచయమైన ఆయన కుమార్తె తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి. వరలక్ష్మి శరత్ కుమార్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకుంది కేవలం తెలుగులోనే కాకుండా తెలుగు ను మించి తమిళ్లోనే ఎక్కువ సినిమాలు చేసింది.

విభిన్నమైన పాత్రలను పోషించి తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఇష్టమైన నటిగా మారిపోయింది. వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన క్రాక్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
ఆ క్రాక్ సినిమాలోని జయమ్మ పాత్రలో వరలక్ష్మి నటించిన తీరు అద్భుతమైన చెప్పొచ్చు. విలన్ గా కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ ను ఇచ్చింది. అలానే గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన వీర సింహారెడ్డి సినిమాల్లో కూడా అద్భుతమైన నటనను ప్రదర్శించింది.

ఇకపోతే రీసెంట్ గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ చిత్రంలో తేజ సోదరిగా నటించి మంచి మార్కులను పొందుకొంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరలక్ష్మి ఇచ్చిన అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఈ సినిమాకి మరికొంత ప్లస్ అయింది.

- Advertisement -

ఇకపోతే వరలక్ష్మి శరత్ కుమార్ యొక్క మ్యారేజ్ గురించి ఎప్పటినుంచో అనేక రూమర్ల మొదలవుతూ వచ్చాయి. ఈమె విశాల్ తో ప్రేమాయణం జరుపుతుందని. విశాల్ ను పెళ్లి చేసుకుంటుందని ఒక కాలంలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ధనుష్ తో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా వినిపించాయి. ఈ మధ్యకాలంలో శింబు తో కూడా తాను ప్రేమలో ఉన్నట్టు వార్తలు వినిపించాయి. ఇకపోతే ఆమె ఇప్పుడు అఫీషియల్ గా తన యొక్క భాగస్వామిని రివిల్ చేసింది.

వరలక్ష్మి శరత్ కుమార్ ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్త నిక్లాయ్ సచ్‌దేవ్ తో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఈ నిశ్చితార్థం నిన్ననే జరిగింది. ఆమె నటించిన హనుమాన్ సినిమా కూడా నిన్నటికి 50 రోజులు పూర్తి చేసుకుంది. అయితే ఈ నిశ్చితార్థ వేడుకకు కేవలం అత్యంత సన్నిహితులైన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వరలక్ష్మి కాబోయే భర్త నిక్లాయ్ సచ్‌దేవ్ ఆర్ట్ గ్యాలరీని నడుపుతున్నారు.

వీరిద్దరూ గత 14 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, ఇప్పుడు తల్లిదండ్రుల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నారని సమాచారం. అయితే వీరి వివాహం ఎప్పుడు జరగబోతుంది అనే విషయం మీద క్లారిటీ లేదు వీలైనంత త్వరలో వరలక్ష్మి శరత్ కుమార్ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వనుంది. ఇకపోతే 40ఏళ్లు ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ కి ఇప్పటివరకు ఎన్నెన్నో పెళ్లి విషయాలను క్రియేట్ చేసుకుంటే వచ్చారు. ఎట్టకేలకు ఈ అనౌన్స్మెంట్ తో అన్నిటికీ చెక్ పెట్టింది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు