Priyanka Nalkari: సీక్రెట్ గా పెళ్లి..కానీ ఏడాదికే విడాకులు..!

Priyanka Nalkari

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఎప్పుడు ప్రేమలో పడతారో తెలీదు.. ఎప్పుడు పెళ్లిలో చేసుకుంటారో తెలియదు.. అయితే కొంతమంది పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంటే.. మరికొంతమంది పెద్దలు కుదుర్చిన వివాహాలను చేసుకుంటున్నారు. అయితే ఇంకొంతమంది తమకు నచ్చిన వారిని ప్రేమించి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయినా సరే వారిని ఎదురించి రహస్యంగా వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెడితే.. మరి కొంతమంది ఆ రహస్యంగా వివాహం చేసుకొని ఎవరికీ తెలియకుండానే విడాకులు తీసుకుంటూ.. చడీచప్పుడు కాకుండా ఎవరి కెరియర్ పై వారు ఫోకస్ పెడుతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ సీరియల్ నటి ప్రియాంక నల్కరి కూడా ఒకరు.

ప్రముఖ సీరియల్ నటి.. తెలుగమ్మాయి ప్రియాంక నిల్కరి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడుగుపెట్టిన ప్రియాంక.. ఆ తర్వాత తెలుగు, తమిళ్ సీరియల్స్ తో బిజీ అయింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్ సీరియల్స్ చేస్తూనే.. టీవీ షోలు కూడా చేస్తున్న ప్రియాంక.. ఇటీవల జబర్దస్త్ లాంటి కామెడీ షోలలో కూడా అలరించింది. యాంకర్ గా కొన్ని షోలు చేసిన ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ప్రియాంక ఇటీవల సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ ముచ్చటించింది.

ఈ నేపథ్యంలోనే ఒక నెటిజన్.. మీరు మీ భర్తతో విడిపోయారా ? అని ప్రశ్నించగా.. దానికి సమాధానం ఇచ్చింది.. ఇకపోతే గత సంవత్సరం మార్చిలో రాహుల్ వర్మ అనే నటుడిని మలేషియాలోని ఒక ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.. ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకున్న ప్రియాంక, రాహుల్ వర్మలు ఏడాది తిరక్కుండానే విడిపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు..

- Advertisement -

కొంతమంది మాత్రం ఈ మాత్రం దానికి పెళ్లి చేసుకోవడం ఎందుకో అంటూ విమర్శలు కూడా చేస్తున్నారు.. అయితే వారిద్దరి మధ్య విడిపోయే అంతగా ఏం జరిగిందో అని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ప్రియాంక నల్కరి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికైతే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఏడాది తిరక్కుండానే విడాకులు తీసుకోవడంతో అంత మనస్పర్ధలు ఏమొచ్చాయో అంటూ అభిమానులు ఆరాధిస్తున్నారు. మరి దీనిపై ప్రియాంక ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు