Actress Kavitha: పిల్లలు వద్దని అలాంటి కండీషన్.. కానీ రెండు నెలలకే. కన్నీరు మున్నీరు..!

Actress Kavitha.. సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది హీరోయిన్లు ఎన్నో విషయాలలో ఇబ్బంది పడుతూ ఉంటారు.. అది సినిమా జీవితమైనా.. వ్యక్తిగత జీవితమైనా.. అలా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న వారిలో ప్రముఖ నటి కవిత కూడా ఒకరు . చిత్ర సీమలో మోస్ట్ సీనియర్ యాక్టర్ అని చెప్పవచ్చు. 11 ఏళ్ల ప్రయాణం లోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె తెలుగు, తమిళ్, మలయాళీ భాషలో వందలాది చిత్రాలలో నటించి మెప్పించింది.. ఇక చిత్ర పరిశ్రమలో సీనియర్ మోస్ట్ యాక్టర్ గా పేరు సంపాదించుకున్న కవిత.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, చిరంజీవి లాంటి దిగ్గజ నటుల చిత్రాలలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. హీరోయిన్ గాను క్యారెక్టర్ ఆర్టిస్టుగాను భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె తన జీవితం ఎప్పుడూ ఒడిదుడుకులతోనే సాగుతూ వచ్చిందని చెప్పవచ్చు.

ఓకే సమయంలో భర్త , కొడుకుని కోల్పోయిన కవిత..

Actress Kavitha: Such a condition of not having children.. but only for two months.  No tears..!
Actress Kavitha: Such a condition of not having children.. but only for two months. No tears..!

మరీ ముఖ్యంగా కరోనా వచ్చినప్పుడు ఆమె జీవితం ఒక్కసారిగా అతలాకుతలమైంది ..భర్త చనిపోవడం , ఆ బాధ నుంచి తెరుకోక ముందే కొడుకు కూడా చనిపోవడంతో ఆమె ఒంటరి అయ్యింది.. ఈ విషాదాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాలను బయటపెట్టింది.. తన ఫ్యామిలీలో ముందు నుంచి విషాదకర సంఘటనలు ఎదురవుతూనే ఉన్నాయని చెప్పుకొచ్చిన కవిత.. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి రావడం.. పెళ్లి కూడా అంతే త్వరగా చేసుకోవడం.. ఆ సమయంలో ప్రేమ గురించి పెద్దగా తెలియదని చెప్పుకొచ్చింది..

అందుకే పిల్లలు వద్దనుకున్నా..

ఆమె మాట్లాడుతూ నాకు కాబోయే భర్త సూపర్ స్టార్ కృష్ణ లాగా ఉండాలనుకున్నాను. రిషి కపూర్ ల నన్ను చూసుకోవాలనుకున్నాను.. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాను.. అనుకోకుండా దశరథ రాజును వివాహం చేసుకున్నాను. అయితే పెళ్లి తర్వాత ప్రేమించడం మొదలుపెట్టాను.. పెద్దలు పెళ్లి ఫిక్స్ చేశాక మా ఆయనకే ఒక కండిషన్ పెట్టాను.. నేను పిల్లలను కనను అని చెప్తే.. జోక్ చేస్తున్నానని ఆయన పట్టించుకోలేదు.. కానీ పెళ్లి తర్వాత మా అత్తగారేమో పిల్లల్ని త్వరగా కనాలి అని.. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని చెప్పింది.. కానీ మా అమ్మకు మాత్రం నేను పిల్లలను కననమ్మా అని చెబితే.. ఎందుకమ్మా అలా అంటావు.. పిల్లలు ఉండాలి కదా అని చెప్పింది. అప్పుడు మా ఇంట్లో జరిగిన విషాదం గురించి మా అమ్మకు నేను మళ్ళీ గుర్తు చేశాను..

- Advertisement -

కూతురు పుట్టాక మళ్ళీ సంతోషం మొదలైంది..కానీ ..

నువ్వు తమ్ముడిని కన్నావు.. చిన్నవయసులోనే మరణించాడు.. నువ్వు కనకపోతే అసలు వాడు మరణించేవాడు కాదు కదా.. పుట్టకపోతే చావే లేదు కదా.. అందుకే పిల్లల్ని పుట్టించడం ఎందుకు? చంపడం ఎందుకు? అని అడిగాను..అందుకే నేను పిల్లలను కనను అని చెప్పాను.. కానీ నాకు మా అమ్మ, నా భర్త ధైర్యం చెప్పి పిల్లలను కనాలని.. ఆ తర్వాత భవిష్యత్తు గురించి భరోసా ఇచ్చారు.. అలా వారు సర్ది చెప్పిన రెండు నెలలకే నేను గర్భవతినయ్యాను.. అయినా సరే ప్రతిరోజు నేను నా తమ్ముడు ఫోటో పట్టుకొని ఏడుస్తూనే ఉన్నాను. ఎప్పుడూ ఏడుస్తూ ఉంటే నువ్వు ఇంకా ఇబ్బంది పడతావు అని చెప్పి నా భర్త నన్ను వరల్డ్ టూర్ తీసుకెళ్లారు. తర్వాత కూతురు పుట్టాక నా మనసు మారిపోయింది ..సంతోషం పెరిగింది అలా మొత్తం ముగ్గురు పిల్లల్ని కన్నాను కానీ ఒకేసారి నా భర్త, కొడుకు మరణించడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ చెప్పింది కవిత.ఇక ఇప్పుడు రాజకీయాలలోకి అడుగులు వేసింది.. అయినా సరే ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు