Suriya Injured : హీరోకు ఆక్సిడెంట్… ఆగిపోయిన షూటింగ్

తమిళ స్టార్ హీరో సూర్య, ట్యాలెంటెడ్ డైరెక్టర్ శివ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా ఫిలిం “కంగువా”. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై ఇప్పటికే ఏడాది పూర్తయింది. పిరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని డైరెక్టర్ శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని సూర్యతో రొమాన్స్ చేయబోతోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబి డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు ఇదే తొలి తమిళ చిత్రం కాగా ప్రస్తుతం మూవీ షూటింగ్ ఆఖరి దశలో ఉంది. అయితే తాజాగా సినిమా షూటింగ్ సెట్ లో సూర్యకు ప్రమాదం జరిగిందని సమాచారం.

చెన్నైలో “కంగువా” సినిమాకు సంబంధించిన ఫైటింగ్ సీన్ చిత్రకరిస్తున్న సమయంలో అకస్మాత్తుగా కెమెరా సూర్య మీద పడిపోయిందట. ఈ అనుకోని సంఘటనలో ఆయన భుజానికి గాయం కావడంతో వెంటనే సూర్యను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి షూటింగ్ ను మేకర్స్ ఆపేసినట్టు సమాచారం. సూర్య గాయాల పాలవ్వడంతో ఆయన అభిమానులు ఆందోళనలో ఉన్నారు. ఈ ఘటనలో మూవీ టీం ఇంకెవరికైనా గాయాలయ్యాయా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు రీస్టార్ట్ అవుతుంది అనే విషయం తెలియాల్సి ఉంది. మేకర్స్ నుంచి ఆ యాక్సిడెంట్ కు సంబంధించిన అధికారిక అప్డేట్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. సూర్య త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కాగా ఈ సినిమాను ఏకంగా 38 భాషల్లో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు మేకర్స్. ఇలాంటి తరుణంలో మూవీకి ఇలాంటి అనుకోని అడ్డంకులు ఎదురవడంతో మేకర్స్ కూడా టెన్షన్ లో ఉన్నారు.

- Advertisement -

“కంగువా” మూవీ షూటింగ్ ప్రస్తుతం చెన్నైలోని పూంతమల్లి సమీపంలోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈరోజు ఉదయం సూర్య పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా రోప్ కెమెరా కిందపడి పడిపోయిందట. హైదరాబాద్, ముంబై, కొడైకెనాల్ లో సినిమాను ఇదివరకు షూట్ చేశారు. ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ వంటి ప్రమోషనల్ కంటెంట్ తో “కంగువా”పై భారీగా హైప్ క్రియేట్ అయ్యింది. కాగా సుర్యకు ఇదే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. సౌత్ లో స్టార్ హీరోగా భారీగా పాపులారిటీ అందుకున్న సూర్య పాన్ ఇండియా రేసులోకి ఎంట్రీ ఇవ్వడానికి ఇదే కరెక్ట్ మూవీ అంటున్నారు ఆయన అభిమానులు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు