7G Brindavan Colony 2 : 7జి బృందావన్ కాలనీ ఆగిపోయినట్టేనా.?

7G Brindavan Colony 2 : కొన్ని సినిమాలకు ఎప్పుడు కల్ట్ స్టేటస్ ఉంటుంది. అలా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక సినిమా సెవెన్ జి బృందావన్ కాలనీ. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ అయింది. ప్రముఖ నిర్మాత A.m రత్నం తనయుడు రవి కృష్ణ హీరోగా నటించాడు. రవి కృష్ణ సరసన సోనియా అగర్వాల్ హీరోయిన్గా కనిపించింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించి రిలీస్ కూడా మంచి రెస్పాన్స్ ను సాధించుకుంది. సెల్వరాఘవన్ కెరియర్ లో కూడా ఇది ఒక బెస్ట్ ఫిలిం అని చెప్పొచ్చు.

7G Brindavan Colony

7జి బృందావన్ కాలనీ స్టోరీ

రవి ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. అతను ఎప్పుడూ క్లాస్ కు వెళ్ళకుండా, పరీక్షల్లో పాసవకుండా, గొడవల్లో తలదూర్చుతూ ఉంటాడు. తండ్రి అతన్ని పనికిరానివాడివని తిడుతూ ఉంటాడు. రవి కూడా తానంటే తండ్రికి ఇష్టం లేదని అతనితో గొడవపడుతూ ఇంట్లోంచి వెళ్ళిపోతానని బెదిరిస్తూ ఉంటాడు. ఇలా ఉండగా పక్కనే ఉన్న ఇంటికి ఒక హిందీ మాట్లాడే మార్వాడీ కుటుంబం రాకతో అతని జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. రవి ఆ కుటుంబంలో ఉండే అందమైన అమ్మాయి అనిత (సోనియా అగర్వాల్) తో లవ్ లో పడతాడు. అతను ఆమెతో చనువుగా ఉండాలని ప్రయత్నించినా ఆమె అతన్ని పట్టించుకోదు.

- Advertisement -

రవి ధైర్యం చేసి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెబుతాడు. ఆమె ఒప్పుకోకపోయినా వెంట పడుతూనే ఉంటాడు. మొత్తానికి అమ్మాయి తన ప్రేమను ఒప్పుకుని ఉద్యోగం కూడా ఇప్పిస్తుంది. రవి తండ్రి కూడా కొడుకు ప్రయోజకుడయ్యాడని సంతోషిస్తాడు. మరోవైపు అనిత తండ్రి వ్యాపారం దెబ్బతిన్నందువల్ల మరో హిందీ కుటుంబం వారికి సహాయం చేసిందనీ వాళ్ళ అబ్బాయికి తమ అమ్మాయినిచ్చి పెళ్ళి చేయాలని చెబుతుంది. అనిత ఇంట్లోంచి తప్పించుకుని రవితో కలిసి ఓ హోటల్ కి వెళుతుంది.

అక్కడ అనిత రవి తనను ప్రేమించినందుకు జీవితాంతం బాధ పడకుండా ఉండాలనీ, తనకు తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకునే ముందు రవితో ఒక రాత్రి గడపాలనుందనీ చెబుతుంది. రవి మొదట ఆశ్చర్యపోయినా అందుకు అంగీకరించి ఆ రాత్రి వారిద్దరూ ఒక్కటవుతారు. కానీ ఉదయం లేవగానే రవి అనితతోనే జీవితాంతం కలిసి ఉండాలనుకున్నట్లు చెబుతాడు. దాంతో అనిత తనను కేవలం శారీరక సుఖం కోసమే అలా అడుగుతున్నాడని వాదిస్తుంది. అలా కోపంలో విసురుగా హోటల్ రూములో నుంచి బయటకు వచ్చి రోడ్డు దాటుతుండగా ఓ లారీ కిందపడి మరణిస్తుంది. రవి కూడా ఆత్మహత్య చేసుకోవాలని వాహనాలకు అడ్డంగా పరిగెడతాడు కానీ అందరూ అతన్ని తిడుతూ వెళ్ళిపోతారు. అప్పట్నుంచి అతను ఆమె ఊహల్లోనే బతుకుతుండటంతో కథ ముగుస్తుంది.

సీక్వెల్ ఆగిపోయినట్టేనా

వాస్తవానికి ఈ కథకు సీక్వల్ చేయడానికి అవకాశం ఉంది. అలానే సెవెన్ జి బృందావన్ కాలనీ సినిమాకు సీక్వెల్ గా సినిమా వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా ఇప్పుడు ఆగిపోయింది అని వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన ఈ సినిమా ప్రస్తుతం జరగట్లేదు అని తెలుస్తుంది. నిర్మాత ఏం రత్నం ప్రెసెంట్ హరిహర వీరమల్లు అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ మళ్లీ డేట్ ఇస్తే ఈ సినిమా ముందుకు సాగుతుంది. ఈ సినిమాకి ఎం రత్నం తనయుడు దర్శకత్వం వహించనున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు