Allu Arjun: బన్నీ ధరించిన వాచ్ ఖరీదు ఎంతో తెలుసా..?

Allu Arjun: టాలీవుడ్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోగా పేరు సంపాదించారు.. పుష్ప చిత్రంతో ఇతర దేశాలలో కూడా అల్లు అర్జున్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. మొదట గంగోత్రి సినిమాతో తన సినీ కెరీర్ ని ప్రారంభించిన అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. తన కెరియర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించడమే కాకుండా బ్లాక్ బాస్టర్ విజయాలను కూడా అందుకున్నారు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమానే అల్లు అర్జున్ సినీ కెరీర్ కి ఒక మైలురాయి అని చెప్పవచ్చు.

మేనరిజంతో ఆకట్టుకుంటున్న బన్నీ..

పుష్ప-2 సినిమా పేరుతో సీక్వెల్ ని కూడా తెరకెక్కిస్తున్నారు.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది. ఇప్పటివరకు పుష్ప-2 కి సంబంధించిన పోస్టర్స్, పాటలు , టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళితే అల్లు అర్జున్ కి స్టైలిష్ స్టార్ అనే బిరుదు ఉన్న విషయం తెలిసిందే. తనదైన మేనరిజంతో యూత్లో ఫేవరెట్ హీరోగా పేరు సంపాదించారు అల్లు అర్జున్. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ కు సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నది.

అల్లు అర్జున్ ధరించిన వాచ్ ధర..

Allu Arjun: Do you know the cost of the watch worn by Bunny?
Allu Arjun: Do you know the cost of the watch worn by Bunny?

ఇటీవలే అల్లు అర్జున్ టాలీవుడ్ దర్శకుల దినోత్సవానికి ముఖ్యఅతిథిగా కూడా హాజరు కావడం జరిగింది. ఈ వేడుకలలో చాలా సింపుల్ గా స్టైలిష్ గా కనిపించారు అల్లు అర్జున్. అయితే ఫ్యాన్స్ ను మాత్రం ఈ వేడుకలలో అల్లు అర్జున్ ధరించిన పనైరా వాచ్ ఆకర్షించింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ వాచ్ ధర.. సుమారుగా రూ .3,97,431 లక్షలు అన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక్కసారిగా నెటిజెన్స్ షాక్ గురవుతున్నారు.

- Advertisement -

ఆగస్టు 15 న పుష్ప -2

ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్లో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.. ఇందులో రష్మిక హీరోయిన్గా నటించగా అనసూయ , సునీల్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. సంగీతాన్ని దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు. ఇప్పటికే పుష్ప రాజ్ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సెలబ్రిటీలు కూడా ఈ పాటకు డాన్స్ వేస్తూ రీల్స్ షేర్ చేస్తున్నారు.

త్రివిక్రమ్ తో తదుపరిచిత్రం..

ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయబోతున్నారు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే అలవైకుంఠపురం లో అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేస్తుంది అందుకే ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్లో సినిమా అంటే అభిమానుల సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరొకసారి రాబోతున్న ఈ కాంబినేషన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు