Vikram: నాగార్జున సినీ ప్రస్థానానికి 37ఏళ్ళు

అక్కినేని నాగార్జున. ఈ పేరంటే టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్టర్. మాస్ గా, కింగ్ గా అభిమానులచేత పిలిపించుకునే నాగార్జున తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యి నేటికీ అనగా మే23నాటికి 37ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. మే 23నే నాగార్జున తొలి సినిమా అయిన “విక్రమ్” రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద విజయ ఢంకా మోగించింది. ఈ సందర్బంగా నాగార్జున గురించి ఆయన తొలి చిత్ర విశేషాలను గురించి కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

80వ దశకంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సీనియర్ యాక్టర్లు గా రిటైర్డ్ స్టేజి కి వస్తుండగా అప్పటికే కొత్త తరం హీరోల రాక మొదలైంది. చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలు అప్పటికే స్టార్లు గా రాణిస్తున్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆయన స్థానంలో బాలకృష్ణ హీరోగా అభిమానులను అలరిస్తున్నాడు. ఇక ఏఎన్ఆర్ కూడా తన కొడుకును హీరోగా లాంచ్ చేయడానికి సిద్ధమయ్యాడు. అలాంటి సందర్భంలో తనకి బాగా అచొచ్చిన ప్రేమకథల ద్వారానే నాగార్జున ని హీరోగా లాంచ్ చేయిద్దామని ఫస్ అయ్యాడు.

అప్పుడే హిందీలో 1983 లో విడుదలై సూపర్ హిట్ అయిన “హీరో” సినిమాను నాగార్జున హీరోగా రీమేక్ చేయిద్దాం అని ఏఎన్ఆర్ అనుకున్నాడు. ఇక తనతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తీసిన వి. మధుసూధన రావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా అక్కినేని సొంత బ్యానర్ అయిన “అన్నపూర్ణ స్టూడియోస్” పతాకం పై “విక్రమ్” పేరుతో సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా తో 1986 మే23 న నాగార్జున హీరోగా పరిచయమయ్యాడు. ఇక ఈ సినిమాలో శోభన హీరోయిన్ గా నటించింది.

- Advertisement -

ఇక విడుదలైన తొలి రోజు నుంచే విక్రమ్ సూపర్ హిట్ టాక్ తో సెన్సేషనల్ వసూళ్లు సాధించింది. ప్రేమకథా చిత్రం గా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక విక్రమ్ చిత్రం 100రోజులకు పైగా ప్రదర్శింపబడగా, 100డేస్ ఫంక్షన్ లో ఆ రోజుల్లో వరదల్లో నష్టపోయిన రైతులకు ఈ సినిమా కల్లెక్షన్లలోంచి కొంత భాగం విరాళంగా ఇవ్వడం విశేషం.

ఇక విక్రమ్ తర్వాత నాగార్జున కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అక్కినేని బ్రాండ్ ఇమేజ్ తో అవకాశాలు వచ్చినా తనకంటూ సొంత ఇమేజ్ కోసం నాగార్జున చాలా కష్టపడ్డాడు. తనని తాను మార్చుకొని తండ్రిలాగే డిఫరెంట్ గా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు.

1989 సంవత్సరం నాగార్జున కెరీర్ టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అప్పటి వరకు మంచి మంచి సినిమాలు తీస్తున్నా, హిట్లు వస్తున్నా ఎదో వెలితి. నాగార్జున లో ప్రత్యేకత ఏముంది అని అప్పటి విమర్శకులు పెదవి విరుస్తుంటే, వాళ్ళకి సమాధానం గా వచ్చిన చిత్రమే “గీతాంజలి”. మణిరత్నం దర్శకత్వంలో 1989 మే 12 న విడుదలైన ఈ ప్రేమకథా చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా నాగార్జునని నటన పరంగా ఒక మెట్టు పైకి ఎక్కించి అక్కినేని వారసుడిగా శభాష్ అనిపించేలా చేసింది.

ఇక ఆ తరువాత నాగార్జున ని మాస్ హీరోగా టాప్ హీరోల్లో ఒకడిగా నిలబెట్టడమే కాకుండా, టాలీవుడ్ కి ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసి తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రం “శివ”. టాలీవుడ్ కాంట్రవర్సీల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా ద్వారానే దర్శకుడిగా పరిచయమయ్యాడు. 1989 oct 5 న విడుదలైన ఈ సినిమా ద్వారా నాగార్జున బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా, ఫైట్స్, టేకింగ్, క్వాలిటీ విషయాల్లో టాలీవుడ్ కి కొత్త పాఠాలు నేర్పాడు. ఇక ఆ తర్వాత హలో బ్రదర్, మాస్, కింగ్ లాంటి కమర్షియల్ సినిమాలు చేస్తూనే అన్నమయ్య, శ్రీ రామదాసు లాంటి భక్తి రస చిత్రాల్లోనూ నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు నాగార్జున తనయులైన నాగ చైతన్య, అఖిల్ కూడా తండ్రి లాగే సినిమాల్లో మెప్పిస్తున్నారు. అటు నాగార్జున కూడా కొడుకులతో సమానంగా ఇప్పటికీ సినిమాలు చేస్తూ వాళ్ళకి పోటీనిస్తున్నాడు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు