10 Years For Manam: మనం ఒక మరుపురాని జ్ఞాపకం

10 Years For Manam: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా కొన్ని సినిమాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. రోజులు మారినా సంవత్సరాల మారిన తరాలు మారిన కొన్ని సినిమాలకి ఉన్న స్థాయి మాత్రం తగ్గదు. ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అక్కినేని ఫ్యామిలీ ఎన్ని సేవలు అందించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు గారి తో మొదలైన సినీ ప్రస్థానం నేడు అక్కినేని అఖిల్ వరకు విజయవంతంగా కొనసాగుతుంది. అయితే ఈ మూడు తరాలను కూడా ఒకే సినిమాలో పెట్టి ఆ కుటుంబానికి తెలుగు సినిమాకి ఒక మర్చిపోలేని సినిమాను అందించాడు విక్రమ్ కే కుమార్.

విక్రమ్ కె కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు విక్రమ్ కే కుమార్ తీసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని రాబట్టాయి. అయితే ఒక జోనర్ లో సినిమా తీసిన వెంటనే వేరే జోనర్ సినిమా తీయటం విక్రమ్ కే కుమార్ కు అలవాటు. ఇష్క్ అనే సినిమాతో నితిన్ కెరియర్ కి మర్చిపోలేని హిట్ సినిమాను ఇచ్చిన తర్వాత. అక్కినేని ఫ్యామిలీకి మనం అని ఒక సినిమాను అందించాడు. ఈ సినిమాలో అక్కినేని ఫ్యామిలీ లోని మూడు తరాలను చూపించి సక్సెస్ సాధించాడు.

మూడు తరాలను ఒకే సినిమాలో

అక్కినేని కుటుంబంలోని మూడు తరాల నటులను కూడా ఒకే సినిమాలో ఉండే విధంగా ప్లాన్ చేసి ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగించి మనసును హత్తుకునే సినిమాలు ప్రేక్షకులకి అందించాడు విక్రమ్ కే కుమార్. ఈ సినిమాలోని అక్కినేని నాగేశ్వరరావు నుంచి అక్కినేని అఖిల వరకు ప్రతి ఒక్కరికి మంచి ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్పొచ్చు. ఇకపోతే అక్కినేని నాగేశ్వరరావు గారికి క్యాన్సర్ చివరి దశలో ఉన్న టైంలో తన చావును కూడా వాయిదా వేసి ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. అయితే ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న కలను ఈ సినిమాతో నిజం చేసుకున్నారు.

- Advertisement -

Manam

కుటుంబం అంతటికి ప్రత్యేకం

ప్రతి ఒక్కరి జీవితంలో సూపర్ హిట్ అయిన సినిమా అంటూ ఒకటి ఉంటుంది కానీ ఒక ఫ్యామిలీ అందరికీ ప్రత్యేకమైన సినిమా అంటూ రేర్ గా ఉంటుంది. అలా రేర్ వచ్చిన సినిమా మనం. ఈ సినిమా నేటికీ 10 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు. ఇకపోతే ఈ రి రిలీజ్ కి హైదరాబాద్ లోని దేవి థియేటర్ కి నాగచైతన్య హాజరయ్యారు. ఈ సినిమాకి అనుప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాలోని ప్రతిపాట ఒక మంచి ఫీల్ ను క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలోని పాటలకు చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు