Relationship Tips : బ్రేకప్ తరువాత అమ్మాయిలు ఏం చేస్తారో తెలుసా?

Relationship Tips : ఈ బిజీ లైఫ్ స్టైల్ లో ప్రేమ కోసం పరితపించే హృదయాలు ఎన్నో. ఇక ప్రేమలో ఉన్న వాళ్ళు మాత్రం హ్యాపీగా, సరదాగా ఉంటారు. కానీ లవర్స్ మధ్య చాలా సార్లు చిన్న చిన్న విషయాలకే గొడవ జరుగుతూ ఉంటుంది.. కొన్నిసార్లు ఆ గొడవ పెద్దది బ్రేకప్ దాకా వెళుతుంది. అలా జరిగినప్పుడు అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ కచ్చితంగా బాధపడతారు. కొన్నాళ్ల తర్వాత దాని నుంచి కోలుకుని మామూలు జీవితం జీవించడానికి అమ్మాయిలు కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో బిజీ అవుతారు. మరి ఇంతకీ బ్రేకప్ నుంచి కోలుకోవడానికి అమ్మాయిలు ఏం చేస్తారు అనే ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళ్తే…

1. గూఢచర్యం

సాధారణంగా లవ్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమ పార్ట్నర్ ఎవరెవరితో మాట్లాడుతున్నాడు? ఏం చేస్తున్నాడు అనే విషయాలపై ఓ కన్నేసి ఉంచుతారు. అయితే విడిపోయిన తర్వాత కూడా వాళ్ళు అలా చేయడం మానేయరు. తమ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందనే విషయాన్ని ఖచ్చితంగా ట్రాక్ చేస్తూ ఉంటారు. 2.

2. బ్లాక్ అన్ బ్లాక్…

ఇక తమ లవర్ తో విడిపోయిన తర్వాత అమ్మాయిలు మొదట్లో బ్లాక్ చేసేస్తారు. కానీ కొన్ని రోజులు తర్వాత మళ్లీ తమ ఎక్స్ ను అన్ బ్లాక్ చేస్తారు. వారి జీవితంలోకి ఇంకెవరైనా వచ్చారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇలా చేస్తారు.

- Advertisement -

3. సోషల్ మీడియా

బ్రేకప్ తర్వాత అమ్మాయిలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తమ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి తెలుసుకోవడానికి దీన్నొక మార్గంగా వాడుకుంటారు. అతను ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఎవరితో ఉన్నాడు? అనే విషయాలను సోషల్ మీడియా ద్వారా కనుక్కుంటారు.

4. షాపింగ్

చాలామంది అమ్మాయిలు బ్రేకప్ నుంచి బయటపడడానికి షాపింగ్ చేస్తారు. షాపింగ్ లో మునిగిపోయినప్పుడు వేరే ఆలోచనలు రావు. కాబట్టి చాలా వరకు ఒత్తిడి తగ్గిపోతుంది.

5. పార్టీ

ఇక బ్రేకప్ బాధను అధిగమించడానికి అమ్మాయిలు ఎంచుకునే మరొక మార్గం పార్టీ. చాలామంది అమ్మాయిలు తమ పార్ట్నర్ తో రిలేషన్ ను తెంచుకున్న తర్వాత పార్టీలకు వెళ్తారు. అంతేకాదు ఇతరులతో కలిసి ఆ పార్టీల్లో సరసాలు ఆడతారు.

బ్రేకప్ నుంచి బయటపడాలంటే…

1. పాత జ్ఞాపకాలను దూరం పెట్టేయండి

పార్ట్నర్ తో విడిపోయిన తర్వాత వాళ్ల గురించి ఆలోచించడం పూర్తిగా మానేయాలి. లేదంటే ఒత్తిడి పెరిగి డిప్రెషన్ లోకి వెళ్లి పోతారు.

2. స్నేహితులు

లవర్ కు దూరమైన తర్వాత స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపండి. విడిపోయిన తర్వాత రకరకాల ఆలోచనలు మనసులోకి వస్తాయి. కాబట్టి ఒంటరిగా ఉండకుండా సన్నిహితులతో ఉంటే ఆ ఆలోచనలు తగ్గి, ఒత్తిడి దూరమవుతుంది.

3. యోగ లేదా వ్యాయామం చేయండి

బ్రేకప్ అనేది మానసికంగా బలహీనంగా, అలసిపోయేలా చేస్తుంది. ఆ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం చేస్తే మంచిది.

4. ఈ తప్పు చేయొద్దు

కొంతమంది విడిపోయిన తర్వాత తినడం, త్రాగడం మానేస్తారు. అలాంటి తప్పు చేయవద్దు. ఇది మిమ్మల్ని శారీరకంగా బలహీనపరుస్తుంది. విడిపోయిన తర్వాత జీవితంలో ముందుకు సాగాలంటే పోషకాహారం తినండి. మంచి విషయాలు ఆలోచించండి. మీకు ఇష్టమైన పనిని చేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు