Adipurush: రావణ్‌ను దాచడంలో రహస్యమేమీ? వ్యూహమా… జక్కన్న స్ట్రాటజీ ఉందా?

ఆదిపురుష్ చిత్ర యూనిట్ తమ ప్రమోషన్లలో బిజీ అవుతుంది. జూన్6 న తిరుపతిలో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక జరగగా దానికి చిత్ర బృందం మొత్తం పాల్గొని తమ సినిమాను ఆదరించామని ప్రేక్షకులను కోరారు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగిసాక హీరోయిన్ కృతి సనన్, డైరెక్టర్ ఓం రౌత్ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఆదిపురుష్ యొక్క ఫైనల్ ట్రైలర్ ను అభిమానులతో కలిసి వీక్షించారు ప్రభాస్. అయితే ఈ ట్రైలర్ చూసిన తర్వాత అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఒక అనుమానం మొదలైంది. ముందుగా విడుదలైన ఆదిపురుష్ టీజర్ లో రావణుడి పాత్రకి సంబంధించి లుక్స్ పై తీవ్ర ప్రజల నుండి ఆగ్రహం వ్యక్తమైంది. ఆ పాత్ర లుక్స్ ఒక మహమ్మదీయుడిని పోలి ఉన్నాయని, ఇంకా ఆ పాత్రకి హాలీవుడ్ సినిమాల్లో లాగా మోడ్రన్ వార్ గెటప్ వేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇంత పెద్ద డైరెక్టర్ అయి ఉండి రావణ బ్రహ్మ రూపం ఎలా ఉంటుందో తెలియదా అని దర్శకుడికి చివాట్లు పెట్టారు.

అంతే కాదు టీజర్ లో రావణుడు పుష్పక విమానంలో కాకుండా ఏదో రాక్షస పక్షిపై వస్తున్నట్టు చూపించడం కూడా చాలా మందికి నచ్చలేదు. ఎందుకంటే పుష్పక విమానం పురాణాల్లో దేవతలు, రాక్షసులు తిరిగే ఒక వాహనం. కానీ ఈ సినిమాలో ఇలా చూపించడం వల్ల ప్రేక్షకులు సీరియస్ అయ్యారు. ఇది గమనించిన చిత్ర యూనిట్ తర్వాత విడుదల చేసిన ట్రైలర్ లో ఇలాంటి మిస్టేక్స్ కనబడకుండా జాగ్రత్త వహించారు.

- Advertisement -

అయితే ట్రైలర్ లో రావణుడి గెటప్ ని మాత్రం చూపించకుండా ప్లాన్ చేసి మళ్ళీ విమర్శలకు తావివ్వకుండా చేసారు ఓం రౌత్ . కానీ రీసెంట్ గా విడుదలైన ఫైనల్ ట్రైలర్ లో కూడా రావణుడి రూపాన్ని చూపించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు డైరెక్టర్ ఆదిపురుష్ ను రీ షూట్ చేశాడా? లేక ఉన్న సినిమాలోనే నెగిటివ్ గా కనిపించకుండా ట్రైలర్ కట్ చేసి చూపించాడా అని ఆడియన్స్ కి డౌట్ రాక మానదు.

ఆదిపురుష్ ట్రైలర్ లో రాముడివైపు అన్ని పాత్రలను చూపించిన దర్శకుడు రావణుడి వైపు ఉన్న పాత్రలను ఎందుకు చూపించలేదు. రావణుడితో పాటు కీలకమైన పాత్రలైన కుంభకర్ణుడు, మేఘనాథుడు, శూర్పణఖ ఇంకా ఇతర రాక్షస గణాల్నే గాక, విభీషణుడు ఇలాంటి ముఖ్య పాత్రలను ట్రైలర్లో ఎక్కడా చూపించలేదు. మరి దీనికేదైనా కారణం ఉందా?

ఇక ట్రైలర్ ఎండింగ్ లో రావణుడి రూపం గ్రాఫిక్స్ వెనకాల చిన్నగా కనిపించగా టీజర్ లో ఉన్న గెటపే అని తేలిపోయింది. అయితే గెటప్ లో రావణుడి పాత్ర కేవలం క్లైమాక్స్ లోనే ఉంటుందా? లేక సినిమా మొత్తం అలాగే ఉంటుందా అనేది తెలియట్లేదు. ఎందుకంటే రామాయణంలో సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతుడి పాత్రలకు ఎంత ప్రాముఖ్యం ఉంటుందో, అంతే ప్రాముఖ్యంగా రావణాసురుడి పాత్ర ఉంటుంది. మరి డైరెక్టర్ సినిమాను ఎలా చూపించబోతున్నారో ఏమిటో?

అయితే రావణుడి గెటప్ ని చూపించకపోవడం వెనుక జక్కన స్ట్రాటజీ ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. అదేంటంటే రాజమౌళి ప్రతి సినిమాలో హీరో కంటే విలన్ ని ఎక్కువ పవర్ఫుల్ గా చూపిస్తాడు. ఎందుకంటే విలన్ ఎంత బలంగా ఉంటే అతన్ని ఎదుర్కొనే హీరో అంత పవర్ఫుల్ గా తయారవుతాడు. ఇప్పుడు ఓం రౌత్ కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతూ ఆదిపురుష్ లోను ప్రభాస్ కంటే ఎక్కువ పవర్ఫుల్ గా సైఫ్ అలీఖాన్ ని చూపిస్తున్నాడు అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు.

అయితే ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇంకా ఇతర ట్రైలర్ లాంచ్ ఈవెంట్లకి ఈ చిత్రంలో రావణుడి పాత్ర వేసిన సైఫ్ అలీఖాన్ రాకపోవడం గమనార్హం. మరి చిత్ర యూనిట్ కావాలనే ఇలా చేస్తుందా? రావణుడి పాత్ర ట్రైలర్ లో పెద్దగా చూపించకపోవడానికి ఏదైనా కారణం ఉందా అన్నది తెలియాలంటే అది చిత్ర దర్శకుడు ఓం రౌతే చెప్పాలి. లేదా జూన్16 న సినిమా చేసినపుడు క్లారిటీ రావచ్చు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు