Vijay: దళపతి విజయ్ 68 లో విలన్ గా ఒకప్పటి స్టార్ హీరో ?

Vijay

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించబోయే 68వ సినిమా పనులు చక చక జరుగుతున్నాయి. విజయ్ 67 సినిమాగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న లియో సినిమా ఒక పక్క అక్టోబర్ లో రిలీజ్ అవుతుండగానే మరోపక్క నెక్స్ట్ సినిమా పనులు వేగవంతం చేసాడు విజయ్.

లియో సినిమా తరువాత విజయ్.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా గురించి ప్రస్తుతం ఒక క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటంటే వెంకట్ ప్రభు, విజయ్ కాంబినేషన్ రాబోయే సినిమాలో విలన్ గా ఒకప్పటి తమిళ్ స్టార్ హీరో నటించబోతున్నాడట.

అయితే దళపతి విజయ్ ఈ మధ్య కాలంలో చేస్తున్న సినిమాలలో హీరో క్యారెక్టర్ తో సమానంగా విలన్ పాత్రలు ఉంటున్నాయని అందరికి తెలిసిందే. తేరి, మెర్సల్, బిగిల్, మాస్టర్, బీస్ట్ ఇలా అన్ని సినిమాలలో ప్రతి నాయకుడి పాత్రలు చాలా స్ట్రాంగ్ ఉంటూ వస్తున్నాయి. అలాగే ఆయన నెక్స్ట్ సినిమా లియో లో కూడా ప్రతి నాయకుడి పాత్రలో అర్జున్ సర్జ, సంజయ్ దత్ లాంటి నటులు కనిపించబోతున్నారు.

- Advertisement -

ఇక అదే విధంగా విజయ్ , వెంకట్ ప్రభు కాంబినేషన్ లో రాబోయే సినిమాలో కూడా అలాంటి ఒక స్ట్రాంగ్ విలన్ ఉండాలని మూవీ టీం ఫిక్స్ అయ్యారని టాక్. అయితే ఆ పాత్ర కోసం ఒకప్పటి కోలీవుడ్ స్టార్ హీరో అరవింద్ స్వామి ని విలన్ గా తీసుకుంటునట్టు సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో పలు సినిమాలలో స్టైలిష్ విలన్ పాత్రలలో కనిపిస్తూ అందరిని మెప్పిస్తున్న అరవింద్ స్వామి దళపతి 68 సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించబోతున్నారన్నమాట.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు