Vijay Deverakonda: రౌడీ హీరోపై సితారా వాళ్లు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు… కానీ అసలు సమస్య ఏంటంటే..?

Vijay Deverakonda:  విజయ్ దేవరకొండను పాన్ ఇండియా హీరో అని పిలవలేం. కానీ, ఆయన నుంచి వచ్చిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ లైగర్ డిజాస్టర్ అయినా, నార్త్‌లో అయితే మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఈ గుర్తింపును ఇప్పుడు వాడుకోవడానికి సితారా ఎంటర్టైన్మెంట్ వాళ్లు ట్రై చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సితారా ఎంటర్టైన్మెంట్ వాళ్లతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నానికి జర్సి లాంటి హిట్ ఇచ్చిన గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్. అలాగే సాక్షీ వైద్యను హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారు. ఫ్యామిలీ స్టార్ అయిన వెంటనే దీన్ని లైన్‌లోకి తీసుకురానున్నారు. అంతే కాదు, ఈ ఏడాది చివరి కల్లా థియేటర్స్ లోకి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే, ఈ సినిమాను సితారా వాళ్లు భారీగా ప్లాన్ చేస్తున్నారట. గౌతమ్ తిన్ననూరి చెప్పిన స్టోరీ సితారా వాళ్లకు బాగా నచ్చిందట. దీంతో ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్ చేయాలని అనుకుంటున్నారట. అందు కోసం భారీ బడ్జెట్ ను కూడా కేటాయించినట్టు తెలుస్తుంది. స్టోరీ బాగుంటే… భారీ బడ్జెట్ పెట్టొచ్చు. కానీ, ఇక్కడ విజయ్ దేవరకొండకు ఉన్న హిస్టరీ చూస్తే తప్పకుండా భయపడాల్సిందే.

- Advertisement -

లైగర్ సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయింది. కానీ, పెద్ద డిజాస్టర్ అయిపోయింది. ఫలితంగా ఆ సినిమాకు డైరెక్టర్ – ప్రొడ్యూసర్ పూరీ జగన్నాథ్ చాలా రోజుల పాటు అండర్ గ్రౌండ్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి సితారా వాళ్లకు కూడా వస్తుందా అనే కామెంట్స్ వస్తున్నాయి. గౌతమ్ తిన్ననూరి చేసిన జర్సి మూవీ హిందీలో కూడా రీమేక్ అయింది. అది బాలీవుడ్ లో డిజాస్టర్ ఫలితాన్ని చూసింది. 80 కోట్ల బడ్జెట్ తో చేసిన ఆ మూవీ కేవలం 20 కోట్ల కలెక్షన్లు మాత్రమే చేసింది. అందు వల్లే ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి.

అయితే ప్రతి సారి అలా జరగదు… ఈ సారి గౌతమ్ తిన్ననూరి కనెక్ట్ అయ్యే స్టోరీ వస్తున్నారని, బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం పక్కా అని అనేవాళ్లు కూడా ఉన్నారు. చూడాలి మరి… విజయ్ దేవరకొండకు ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో…

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు