త్రివిక్రమ్.. టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత ఆ స్థాయి క్రేజ్ ను సొంతం చేసుకున్న దర్శకుడు. ఇతని సినిమాలంటే ప్రేక్షకుల్లో ఎనలేని క్రేజ్. అంతకు మించి త్రివిక్రమ్ మాటలు అంటే చాలా ఇష్టం. ఈయన చాలా సింపుల్ అండ్ హంబుల్ పర్సన్. అలాగే ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి కూడా..! అందుకే తన వద్ద కో- డైరెక్టర్ గా పనిచేసిన కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. త్రివిక్రమ్ వద్ద సత్యం అనే వ్యక్తి కో- డైరెక్టర్ గా పనిచేసేవారు. కానీ కోవిడ్ టైములో ఆయన చనిపోయాడు. దీంతో అతని కుటుంబానికి త్రివిక్రమ్ ఆర్థిక సాయం అందించాడు.
అలాగే అతని కొడుకు వశిష్టని హీరోగా చేసే బాధ్యతను త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకున్నట్టు చిత్ర సీమలో వినిపిస్తుంది. అసలు విషయం ఏంటంటే… ‘కప్పెల’ తెలుగు రీమేక్ ను ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ నిర్మిస్తుంది. తమిళ నటుడు అర్జున్ దాస్ హీరో గా ఎంపికచేసేశారు. అలాగే మరో హీరోగా సిద్దు జొన్నలగడ్డని అనుకున్నారు. సిద్దు మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. దీంతో వశిష్టని అతని ప్లేస్ లో రీప్లేస్ చేసేశాడు త్రివిక్రమ్. దీంతో తన కో – డైరెక్టర్ సత్యం రుణం తీర్చుకున్నట్టు అయ్యింది. వశిష్ట అంతకు ముందు ఓ సినిమా చేశాడు కానీ అది పెద్దగా ఆడలేదు. ఇది క్రేజీ ప్రాజెక్టు కాబట్టి.. అతను నిలబడే అవకాశం ఉంది.