గోపీచంద్ హీరోగా నటించిన ‘వాంటెడ్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు బి.వి.ఎస్.రవి. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ తో ‘జవాన్’ అనే చిత్రాన్ని కూడా తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ బి.వి.ఎస్ రవి టాలీవుడ్లో ఓ సక్సెస్ ఫుల్ రైటర్. కొన్ని హిట్టు సినిమాల్లో ఇతని రైటింగ్ హస్తం ఉంది. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తున్న ‘థాంక్యూ’ చిత్రానికి కథ అందించింది ఇతనే. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత.
తాజా సమాచారం ప్రకారం.. నందమూరి బాలకృష్ణ, బి.వి.ఎస్ రవికి దర్శకుడిగా మరో ఛాన్స్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. బాలయ్య కోసం బి వి ఎస్ రవి ఓ కథ సిద్ధం చేశాడని, అది బాలయ్యకి నచ్చిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. బాలయ్య స్టోరీకి కనెక్ట్ కావడంతో ఈ ప్రాజెక్ట్ దాదాపు సెట్ అయినట్టే అని తెలుస్తుంది. అసలు బాలయ్య- బి.వి.ఎస్ రవి ల కాంబో ఫిక్స్ అవ్వడానికి కారణం `అన్ స్టాపబుల్` అని చెప్పాలి. ఈ షోకి బి.వి.ఎస్ రవి రైటర్ గా పనిచేశాడు. తెర వెనుక ఉండి అంతా నడిపించింది బి.వి.ఎస్ రవినే..! ఈ షో సక్సెస్ అవ్వడంలో అతని కృషి ఉంది. అందుకే బాలయ్య ఇంప్రెస్ అయిపోయి ఛాన్స్ ఇచ్చినట్లు వినికిడి. అయితే ఈ ప్రాజెక్టుని ఎవరు నిర్మిస్తారు.. ఎప్పుడు మొదలవుతుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది.