Thalapathy67: అప్పుడే బిజినెస్ స్టార్ట్..

వారిసు” సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్నారు దలపతి విజయ్. స్టార్ట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం తమిళం లో భారీ కలెక్షన్స్ ను సంపాదించింది. విజయ్ కు జోడిగా రష్మిక మందన్న నటించారు. ఇదే జోష్ తో విజయ్ మరో చిత్ర షూటింగ్ ను మొదలు పెట్టారు. ఇప్పటికే విజయ్ కి మాస్టర్ సినిమాతో హిట్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ తో మరోసారి చేతలు కలపనున్నాడు.

సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా కొన్ని సినిమాలతోనే దేశమంతటా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు లోకేష్ కానకరాజ్. ఖాకి, మాస్టర్, విక్రమ్ సినిమాలతో సౌత్ ఇండియా లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు ఈ యంగ్ డైరెక్టర్. లోకి యూనివర్స్ అనే పేరుతో ఒక దానితో మరొక సినిమాను కనెక్ట్ చేస్తూ, ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ, మంచి హిట్స్ ను అందుకుంటున్నారు. ఇప్పుడు మరోసారి ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

విజయ్ దళపతితో Thalapathy67 అనే సినిమా చేస్తున్నాడు. వీరి కాంబినేషన్ లో వచ్చిన “మాస్టర్” సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మళ్లీ ఇదే కాంబినేషన్ తో ఈ సినిమా రావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అలాగే తలపతి 67 కూడా.. లోకేష్ యూనివర్స్ లో భాగం అని ప్రకటించగా , ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతూ వస్తున్నాయి.

- Advertisement -

ఈ సినిమా నుంచి అప్టేట్స్ కోసం ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి ఎదురుచూశారు. తాజాగా, ఈ సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ ఇచ్చారు నిర్మాణ సంస్థ సెవెన్ స్క్రీన్ స్టూడియోస్. హీరోయిన్ గా త్రిష, ముఖ్య పాత్రల్లో సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, దర్శకుడు మిస్కిన్, దర్శకుడు గౌతమ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్,
ప్రియా ఆనంద్, మాథ్యూ థామస్, శాండీ నటిస్తున్నారని అధికారిక ప్రకటన చేశారు.

ఇంత మంది స్టార్ యాక్టర్స్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం అప్పుడే బిజినెస్ నీ కూడా మొదలు పెట్టేసింది. ఈ సినిమాకి సంబంధించి డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా శాటిలైట్ హక్కులను సన్ టీవీ సంపాదించుకుంది. ఆడియో హక్కులను సోనీ మ్యూజిక్ దక్కించుకుంది.

కాగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటన్న ఈ మూవీ రికార్డులను కొల్లగొట్టడం ఖాయమని సిని విశ్లేషకులు ఇప్పటి నుంచే అభిప్రాయపడతున్నారు.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు