Tamannaah: విరాట్ కోహ్లీ తో క్లోజ్ గా తమన్నా – వీడియో లీక్.. ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో తమన్నా భాటియా ఒకరు. మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా భాటియా… ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలోనే కాకుండా తమిళ్ అలాగే బాలీవుడ్ లోనూ రాణిస్తోంది. తెలుగులో శ్రీ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తమన్నా… ఆ తర్వాత హ్యాపీడేస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. అనంతరం అక్కినేని నాగచైతన్య హీరోగా చేసిన 100% లవ్ సినిమాతో… తమన్నా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే అగ్ర హీరోయిన్ల వరుసలో నిలిచింది.

అనంతరం బద్రీనాథ్, రచ్చ, ఊసరవెల్లి, ఎందుకంటే ప్రేమంట, రెబల్, బాహుబలి లాంటి మంచి సినిమాలు చేసి… మంచి క్రేజ్ సంపాదించింది మిల్కీ బ్యూటీ తమన్నా. అయితే తాజాగా మిల్కీ బ్యూటీ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విరాట్ కోహ్లీ తో అప్పట్లో మిల్కీ బ్యూటీ తమన్న చేసిన ఓ మొబైల్ యాడ్… వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో వారిద్దరూ చాలా క్లోజ్ గా కనిపించారు.

అయితే ఈ వీడియోని చూసిన నెటిజెన్స్… చాలా క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. తమన్నా, విరాట్ కోహ్లీ కలిసి అనుష్క శర్మకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుష్క కాపురంలో తమన్నా నిప్పులు పోస్తుందని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కాకా గతంలో కూడా… మిల్కీ బ్యూటీ తమన్నతో విరాట్ కోహ్లీ ఎఫైర్ పెట్టుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా వార్తలు వచ్చాయి. కానీ చివరికి బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను విరాట్ కోహ్లీ పెళ్లాడాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు