తమన్నా.. మిల్క్ బ్యూటీగా పేరున్న ఈ భామ టాలీవుడ్ లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. కానీ ఇటీవల తమన్నాకు అవకాశాలు భారీగా తగ్గాయి. అడపా దడపా అవకాశాలు వచ్చినా, అవి కూడా ప్లాప్ నే మూటగట్టుకున్నాయి. “ఎఫ్ 2” తర్వాత ఈ భామకు సరైన హిట్స్ పడలేదు. విలన్ గా ప్రయోగం చేసిన “మాస్ట్రో” కూడా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. ప్రస్తుతం ఈ మిల్క్ బ్యూటీ “ఎఫ్3” సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
వరుస ప్లాప్ ల తర్వాత వస్తున్న “ఎఫ్ 3”పై భారీ అంచనాలే పెట్టుకుంది ఈ భామ. ఈ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి తిరిగి రావాలని అనుకుంది. అలాంటి ఈ సినిమాకు అనూహ్యంగా దూరం ఉంటుంది తమన్నా. “ఎఫ్3” యూనిట్ చేస్తున్న ప్రమోషన్స్ లో ఇప్పటి వరకు మిల్క్ బ్యూటీ కనిపించలేదు. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి తమ స్థాయికి మించి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.
కామెడియన్లు సునీల్, అలీ, రాజేంద్ర ప్రసాద్ తో పాటు హీరోయిన్లు మెహ్రీన్, సోనాల్ చౌహన్లు కూడా పలు సందర్భాల్లో మెరిశారు. కానీ తమన్నా, మాత్రం దూరంగానే ఉంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ తమన్నా కనిపించలేదు. దీంతో ఎఫ్3 యూనిట్, తమన్నా మధ్య ఎదో జరిగిందనే వార్త సోషల్ మీడియాలో వస్తుంది.
నిజానికి “ఎఫ్ 3” షూటింగ్ మధ్యలో మూవీ యూనిట్ కు తమన్నా మధ్య గొడవలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. కానీ అప్పడు మూవీ టీం ఈ వార్తలను ఖండించింది. అలాంటివి ఏమీ లేవని చెప్పింది. కానీ ఆ వార్తలు నిజమే అనిపించేలా ప్రస్తుతం పరిణామాలు జరుగుతున్నాయి.