Allu Arjun: పుష్ప2 రిలీజ్ డేట్ పై సస్పెన్స్ – అదే కారణమా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమాకి సీక్వెల్ గా పుష్ప2 సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. చాలా కాలం కిందట షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా గురించి పెద్దగా అప్డేట్స్ లేకపోవటం వల్ల ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పుష్ప పాన్ ఇండియా హిట్ అవ్వడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప2 ని సుకుమార్ ఇంకా గ్రాండ్ గా ప్లాన్ చేశాడని సమాచారం. ఆ మధ్య రిలీజ్ అయిన గ్లిమ్ప్స్ సినిమాపై అంచనాలు పెంచగా యాక్షన్ సీక్వెన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి వచ్చిన వార్తలు ఆ అంచనాలను మరింత పెంచుతున్నాయి.

ఇదిలా ఉండగా, పుష్ప2 రిలీజ్ డేట్ గురించి ఇప్పటిదాకా క్లారిటీ లేకపోవటంతో ఫ్యాన్స్ లో ఆందోళన నెలకొంది. డిసెంబర్ లో రిలీజ్ ఉంటుందని వార్తలొచ్చినా, దీనిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోవటమే ఇందుకు కారణం. ఈ సినిమా షూటింగ్ చాలా వరకు ఇంకా పెండింగ్ ఉందని, తొందరపడకుండా అనుకున్న అనుకున్న అవుట్ ఫుట్ వచ్చెనటవరకు షూట్ చేసి కంప్లీట్ చేశాకే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలన్నది సుకుమార్ ప్లాన్ అని అందుకే సస్పెన్స్ మైంటైన్ చేస్తున్నారని సమాచారం.

పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ కి డిసెంబర్ కరెక్ట్ టైమ్ కాదన్నది క్రిటిక్స్ ఒపీనియన్. ఎందుకంటే పుష్ప పార్ట్ 1 కూడా డిసెంబర్ లో రిలీజ్ అయ్యి కీలకమైన సంక్రాతి సీజన్ ని మిస్ చేసుకుందని, సరిగ్గా ప్లాన్ చేసి ఉంటె బాక్సాఫీస్ వద్ద పుష్ప పర్ఫామెన్స్ ఇంకా బెటర్ గా ఉండేదని వారి వాదన. మరి, పుష్ప2 ని కరెక్ట్ టైమ్ లో రిలీజ్ చేసి అల్లు అర్జున్ మరొక పాన్ ఇండియా హిట్ అందుకుంటాడా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు