Samajavaragamana: శ్రీవిష్ణు మార్క్ లాఫ్టర్ రైడ్ – ఇదైనా వర్కౌట్ అవుతుందా..?

శ్రీవిష్ణు, రెబా మోనికా హీరో హీరోయిన్లుగా రూపొందిన ‘సామజవరాగమన’ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా సాగిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిశోర్, సుదర్శన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 29న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చుట్టూ తిరిగే ఈ సినిమా నాన్ స్టాప్ ఎంటర్టైనింగ్ గా సాగుతుందని అనిపిస్తోంది ట్రైలర్ చూస్తుంటే. ట్యాలెంట్ ఉన్న నటుడైనప్పటికీ, కెరీర్లో సరైన హిట్ లేని శ్రీవిష్ణుకి ఈ సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారింది. ఆ మధ్య వచ్చిన బ్రోచేవారెవరురా సినిమాతో హిట్ అందుకున్న శ్రీవిష్ణు ఆ తర్వాత భళా తందనానా, అల్లూరి వంటి సినిమాలతో యాక్షన్ హీరోగా ప్రయత్నించినా వర్కౌట్ అవ్వలేదు.

ఈ సినిమాలో ఫ్యామిలీని పోషించే మిడిల్ క్లాస్ కుర్రాడి క్యారెక్టర్లో నటించాడు శ్రీవిష్ణు. ట్రైలర్లో నరేష్, శ్రీవిష్ణుల మధ్య వచ్చే కామెడీ సీన్స్ సినిమాఫై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నాయి. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ సినిమాను హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దందా నిర్మాతగా వ్యవహరించగా అనిల్ సుంకర సమర్పిస్తున్నారు.

ఈ ఏడాది సమ్మర్లో తెలుగులో చెప్పుకోదగ్గ హిట్ లేకపోవటం, సరైన కామెడీ ఎంటర్టైనర్ సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాకపోవటం ఈ సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పాలి. దగ్గర్లో పెద్ద సినిమాలు కూడా లేవు కాబట్టి, సామజవరగమన సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే బ్లాక్ బస్టర్ దక్కే అవకాశం కనిపిస్తోంది. మరి కొంత గ్యాప్ తర్వాత తనదైన జానర్ తో వస్తున్న శ్రీవిష్ణు ఈసారైనా హిట్ అందుకుంటాడా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు