Sreeleela New Movie : అజిత్ మూవీలో శ్రీలీల… కూతురు పాత్ర అయితే కాదు

Sreeleela New Movie : యంగ్ బ్యూటీ శ్రీలీల గుంటూరు కారం మూవీ తర్వాత కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాలో నటించబోతుందనే వార్త తెరపైకి వచ్చింది. అయితే ఆమె అజిత్ కు కూతురుగా మాత్రం నటించట్లేదండోయ్. మరి ఇంతకీ అజిత్ మూవీలో శ్రీలీల ఎలాంటి పాత్రలో నటించబోతోంది? అనే ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళ్తే…

అజిత్ సినిమాలో ఛాన్స్

గత రెండేళ్ల నుంచి శ్రీలీల టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. చిన్న హీరోల నుంచి రవితేజ, బాలయ్య, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి హీరోలతో ఆడి పాడింది. కానీ బ్యాడ్ లక్ కారణంగా ఈ బ్యూటీ చేసిన సినిమాలు వరుసగా డిజాస్టర్ అవుతూ వచ్చాయి. చివరకు గుంటూరు కారం మూవీకి వచ్చిన రిజల్ట్ కారణంగా ఈ అమ్మడు సైలెంట్ గా సైడ్ అయిపోయింది. అయితే అంతకంటే ముందే సైన్ చేసిన సినిమాల నుంచి కూడా ఆమె తప్పుకోవడం లేదంటే మేకర్స్ ప్రస్తుతం ఆమెకు నడుస్తున్న బ్యాడ్ లక్ ను దృష్టిలో పెట్టుకొని మరో కొత్త హీరోయిన్ ను వెతుక్కోవడం వంటివి జరుగుతూ వచ్చాయి. దీంతో శ్రీలీల పని అయిపోయినట్టే అని అనుకుంటుండగా తాజాగా ఈ బ్యూటీ కోలీవుడ్ లో కొత్త సినిమాకు సైన్ చేసిందని వార్త బయటకు వచ్చింది. అజిత్ హీరోగా నటిస్తున్న కొత్త మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటించబోతుందని సమాచారం.

గుడ్ బ్యాడ్ అగ్లీలో హీరోయిన్ గా…

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై మార్క్ ఆంటోనీ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తో కలిసి స్టార్ హీరో అజిత్ తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్ తో ఈ మూవీని ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జూన్ లో ప్రారంభం కానుంది. ఇక ఈ మూవీ కోసం అజిత్ ఏకంగా రికార్డు స్థాయిలో 150 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు సమాచారం. మే1న అజిత్ పుట్టినరోజున ఈ మూవీ అప్డేట్ రాబోతోంది. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీలో అజిత్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశాన్ని శ్రీలీల కొట్టేసిందని టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఆమెకు కోలీవుడ్ లో ఇది అదిరిపోయే అరంగ్రేటం అవుతుందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ గనక హిట్ అయితే ఆమెను అక్కడి మేకర్స్ రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించే అవకాశం ఉంది. కానీ అజిత్ సరసన శ్రీలీల హీరోయిన్ అంటేనే ఎక్కడో కొడుతోంది.

- Advertisement -

చిరులా విమర్శలు తప్పవా?

అజిత్ సీనియర్ హీరో అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రీలీల నిన్న మొన్న ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ యంగ్ బ్యూటీ సీనియర్ హీరో జోడి అంటే ఎబ్బెట్టుగా ఉంటుందేమో అని అనుమాన పడుతున్నారు అజిత్ అభిమానులు. గతంలో ఓసారి మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటపై ఇలాగే విమర్శలు వచ్చాయి. స్టాలిన్ మూవీ విషయంలో చిరు, త్రిష తండ్రీ కూతుర్లలా ఉన్నారు అనే మాట వచ్చింది. ఇప్పుడు అజిత్, శ్రీలీల జోడిగా అంటే అదే గుర్తొస్తోంది. వీళ్ళిద్దరూ తెరపై తండ్రి కూతుర్లలా ఉంటారేమో అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు