Yashoda : బాగానే ప్లాన్ చేశారు

టాలీవుడ్ అగ్ర హీరోయిన్‌ల‌లో ఒక‌రైన‌ స‌మంత ప్ర‌స్తుతం వ‌రుసగా సినిమాల్లో న‌టిస్తోంది. య‌శోద‌, శాకుంత‌లం వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటూ తన దైన స్టైల్ లో దూసుకెళ్తుంది. ఇదిలా ఉంటే ఇటీవ‌ల స‌మంత సోష‌ల్ మీడియా మ‌యోసిటిస్ అనే వ్యాధి ఉందని ప్ర‌క‌టించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే.

మ‌యోసిటిస్ అనే వ్యాధి బారిన ప‌డిన‌ప్ప‌టికీ ఒప్పుకున్న సినిమాల‌ను చేస్తూనే ఉంది. మ‌యోసిటిస్ అనే వ్యాధి ల‌క్ష‌ల్లో ఒక‌రికి మాత్ర‌మే వ‌స్తుందట‌. ఆ వ్యాధి స‌మంత‌కి రావ‌డంతో అభిమానులు షాక్‌కి గుర‌య్యారు. ఇదిలా ఉంటే స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన య‌శోద చిత్రం నవంబ‌ర్ 11న ప్రేక్ష‌కుల రాబోతుంది. ఈ చిత్రానికి హ‌రి హ‌రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఉన్ని ముకుంద‌న్ య‌శోద‌లో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు. సెన్సార్ బోర్డు య‌శోద చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చింది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. య‌శోద సినిమా 135 నిమిషాల ర‌న్ టైమ్ క‌లిగి ఉన్న‌ట్టు స‌మాచారం.  ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలు దాదాపు తక్కువ టైమ్ లోనే ఉంటున్నాయి.  ఎక్కువ సమయం ఉన్న సినిమాలను ప్రేక్షకులు చూడడానికి అంతగా ఆసక్తి కనబరచడం లేదు.  తక్కువ సమయంలోనే ఎక్కువ చూపించేందుకు దర్శకుడు హరి-హరీష్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.  మొత్తానికి ప్రేక్షకులు కోరుకున్నట్టే ఈ సినిమాని తెరకెక్కించి బేష్ అనిపించుకున్నారు దర్శకుడు హరి-హరీష్. య‌శోద సినిమా ర‌న్ టైమ్ గురించి మూవీ మేక‌ర్స్ మాత్రం అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. ప్ర‌కటిస్తారో లేదో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు