Samantha: టాలీవుడ్ హీరోలపై రివేంజ్ తీర్చుకుంటున్న సమంత ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అందులో కొంతమంది మాత్రమే అతి తక్కువ కాలంలో పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో హీరోయిన్ సమంత ఒకరు. హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో గత 14 సంవత్సరాలుగా పాపులారిటీ కొనసాగిస్తున్న హీరోయిన్ సమంత. అలా ఇప్పటివరకు ఏ ఒక్క హీరోయిన్ ఇంత క్రేజ్ సంపాదించుకోలేకపోయింది.

దీనికి కారణం ఆమె అందం, నటన అలాగే అక్కినేని కుటుంబం ప్రభావం అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమంలో అడుగుపెట్టిన హీరోయిన్ సమంత… ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో దూసుకు వెళ్ళింది. ఎక్కడ తగ్గేదే లేదన్నట్లుగా ముందుకు సాగుతోంది. అంతేకాకుండా ఏం మాయ చేసావే సినిమా సమయంలోనే అక్కినేని హీరో నాగచైతన్య తో ప్రేమాయణం నడిపింది సమంత. ఈ సినిమా సమయంలో ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. అప్పటికే హీరో సిద్ధార్థ తో సమంత బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే.

అయినప్పటికీ హీరోయిన్ సమంత ప్రేమలో నాగచైతన్య పడిపోయాడు. కొన్ని సంవత్సరాలు ప్రేమించుకున్న వీరిద్దరూ… 2017 లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని అనువార్య కారణాలవల్ల సమంత మరియు నాగచైతన్య 2021 సంవత్సరంలో విడిపోయారు. అయితే విడాకుల తర్వాత సమంత అనారోగ్యం బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంతను ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. ముఖ్యంగా స్టార్ హీరోలు ఎవరు కూడా ఆమె ఆరోగ్యం పై స్పందించలేదు.

- Advertisement -

అయితే ఇప్పుడిప్పుడే సమంత అనారోగ్యం నుంచి కోలుకుంటుంది. ఇలాంటి నేపథ్యంలో సమంత హీరోయిన్గా చేయాలని కొంతమంది స్టార్ హీరోలు తమ సినిమా కోసం అడుగుతున్నారట. అయితే తన కష్ట కాలంలో ఎవరు సపోర్ట్ చేయని వారి సినిమాలలో తాను నటించబోనని సమంత తెగేసి చెప్పిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తనతో అండగా ఉన్నవారికి మాత్రమే తాను సపోర్ట్ గా ఉంటానని సమంత చెబుతోంది. అవసరానికి వాడుకునే వారు తనకు వద్దని స్పష్టం చేసిందట సమంత. అయితే ఈ వార్తలు బయటకు రావడంతో ఆ హీరోలపై సమంత రి వేంజ్ తీసుకుంటుందని ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు