Salaar Vs Dunki: డైనోసర్ డామినేషన్… విన్నర్‌ ఇప్పుడే డిసైడ్ అయింది

సినీ ప్రపంచం మొత్తం డిసెంబర్ చివరి వారం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. Salaar Vs Dunki అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. వరుస ఫ్లాప్‌లతో ఉన్న ప్రభాస్ గెలుస్తాడా? లేదా బ్యాక్ టూ బ్యాక్ 1000 కోట్లు కలెక్ట్ చేసిన బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గెలుస్తాడా ? అని అందరూ ఎదురు చూస్తున్నారు. మరి ఈ పోరులో గెలిచేది ఎవరు అనే విషయం రెండు సినిమాల రిలీజ్ ల కంటే ముందే డిసైడ్ అయిపోయింది. అది కూడా ప్రేక్షకులే చేసేసారు. అసలు ఎవరు వినరు అనే విషయం ఎలా డిసైడ్ అయ్యింది? వివరాల్లోకి వెళితే…

పఠాన్, జవాన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో వరుస హిట్స్ అందుకొని జోరు మీద ఉన్నాడు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. అదే జోష్ తో ఇప్పుడు “డంకి” సినిమాతో అందుకోవడానికి రెడీ అవుతున్నాడు. మరోవైపు వరుస డిజాస్టర్ లతో ఈసారైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తాను చేసిన “సలార్” భూమిపై నమ్మకంతో ఉన్నాడు. ఇక ఇద్దరు స్టార్ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద ఢీ అంటే ఢీ అనడానికి రెడీ అవుతున్నారు. షారుక్ ఖాన్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ “డంకి” మూవీ డిసెంబర్ 21న రిలీజ్ కాబోతుండగా, ప్రభాస్ హై వోల్టేజ్ యాక్షన్ ఇండియా మూవీ “సలార్” డిసెంబర్ 22న థియేటర్లలోకి రాబోతోంది. ఒక్కరోజు గ్యాప్ తో ఈ ఇద్దరు హీరోలు బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అయ్యారు. అయితే సినిమా రిలీజ్ కంటే ముందే ఏ మూవీ బాగుంది అన్న విషయాన్ని బుక్ మై షో ద్వారా ప్రేక్షకులు వెల్లడించారు. ఆన్లైన్ టికెట్ బుకింగ్ యాప్ లో ఎక్కువ మంది ప్రేక్షకులు “సలార్” మూవీకే ఓటు వేశారు.

ఇక అసలు విషయంలోకి వెళితే… బుక్ మై షో ఆప్ లో “సలార్” మూవీకి 1.1 మిలియన్ ఇంట్రెస్ట్ లు నవోదయ ఈ సినిమా పట్ల ప్రేక్షకులకు ఏ రేంజ్ లో ఇంట్రెస్ట్ ఉంది అన్న విషయాన్ని బయట పెట్టింది. ఇక షారుక్ “డంకీ” సినిమాకు మాత్రం ఈ యాప్ లో 251k ఇంట్రెస్ట్ లు మాత్రమే రికార్డ్ అయ్యాయి. దీంతో ఈ క్రిస్మస్ విన్నర్ ఎవరు అనే విషయం ఇక్కడే తేలిపోయినట్టు అయింది. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే “సలార్” యాక్షన్ ఎంటర్టైనర్, “డంకి” కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ ఒక్క పోలిక మాత్రమే కాకుండా “సలార్” మూవీ అన్ని ప్రధాన భాషల్లో విడుదలవుతున్న పాన్ ఇండియా మూవీ, కానీ “డంకి” మాత్రం కేవలం హిందీలోనే రిలీజ్ అవుతుంది. ఆటోమేటిక్ గా షారుక్ మూవీకి ఇంట్రెస్ట్ లు తక్కువగానే ఉంటాయి. ఇప్పటికే పలు హిందీ సినిమాలతో దుమ్ము రేపేసిన హిందీ ప్రేక్షకులు ప్రస్తుతం ఒక మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకుల నాడిని కరెక్ట్ గా పట్టుకున్న షారుక్ ఖాన్ అదే జోనర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉన్నాడు. అయితే అలాగని “సలార్” మూవీని తక్కువ అంచనా వేయలేము. ప్రభాస్ సినిమాలు సౌత్ ఇండియాలో కంటే నార్త్ ఇండియా లోనే ఎక్కువ ఆడుతున్నాయి అనడానికి ఆయన గత చిత్రాలే నిదర్శనం. అంటే నార్త్ లో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ దశాబ్దాలుగా హిందీ ఇండస్ట్రీలో పాతుకుపోయిన షారుఖ్ కు ఉన్న క్రేజ్ కంటే తక్కువ ఏమీ కాదు. మరి ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్ కోసం ఆశపడుతున్న షారుక్ కోరికను హిందీ ప్రేక్షకులు నెరవేరుస్తారా? లేదంటే బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఆకలి మీద ఉన్న డైనోసార్ కలను నిజం చేసే దిశగా అడుగులు వేస్తారా? అనేది ఉత్కంఠ భరితంగా మారింది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు