న‌ష్టాల్లో ఆర్ఆర్ఆర్ తెలుగు బ‌య్య‌ర్లు..!

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ ఎస్ రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ మార్చి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన విష‌యం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన మ‌ల్టీ స్టార‌ర్ సినిమా కావ‌డంతో విడుద‌లకు ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా ఈ సినిమాకు క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురుస్తుంది. నేటి వ‌ర‌కు ఈ సినిమా దాదాపు రూ. 1,100 కోట్లు వ‌సూల్ చేసింది. దీంతో భార‌తీయ చ‌ల‌న చిత్ర‌ చ‌రిత్ర‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన మూడో చిత్రంగా రికార్డు సృష్టించింది. అంతా బాగానే ఉన్నా.. తెలుగు బ‌య్య‌ర్ల‌కు మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమా చేదు అనుభ‌వాలే మిగిల్చింద‌ని ట్రేడ్ వ‌ర్గాల వినికిడి.

జ‌క్క‌న్న సినిమాల‌కు ఉన్న‌ క్రేజ్ కి తోడు రామ్ చ‌ర‌ణ్, తార‌క్ వంటి స్టార్ హీరోలు, బాలీవుడ్ నుంచి అజ‌య్ దేవ‌గ‌న్, అలియా భ‌ట్ వంటి ఫేమ్ ఉన్న న‌టీ న‌టులు, ఆర్ఆర్ఆర్ సినిమాలో న‌టించ‌డంతో తెలుగు బ‌య్యర్లు భారీ ధ‌ర‌కే సినిమాను కొనుగోలు చేశారు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక.. ప్ర‌భుత్వాలు టికెట్ల రేట్ల‌ను పెంచ‌డంతో మొద‌ట్లో క‌లెక్ష‌న్లు భారీగానే వ‌చ్చినా.. క్ర‌మంగా ట్రిపుల్ ఆర్ జోష్ త‌గ్గుతూ వ‌స్తుంది. తాజా గా కేజీఎఫ్ చాప్ట‌ర్ – 2 కూడా విడుద‌ల కావ‌డంతో.. తెలుగు స్టేట్స్ లో నైజం మిన‌హా ఎక్క‌డా కూడా బ్రేక్ ఈవెన్ అందుకోలేద‌ని తెలుస్తుంది.

దీంతో రాజమౌళి మ్యాజిక్ తెలుగులో వ‌ర్కౌట్ కాలేదా.. అని నెటిజ‌న్లు అంటున్నారు. గ‌తంలో రాజ‌మౌళి సినిమాల‌కు తెలుగు స్టేట్స్ లో బ‌య్య‌ర్లు ఫుల్ లాభాల్లో ఉండేవారు. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాకు సీన్ మారింది. తెలుగు బ‌య‌ర్లు.. 10 నుంచి 20 శాతం న‌ష్టాల్లో కూరుకుపోయారని స‌మాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు