Dil Raju: ఇది యాపారం గురూ… “మంగళవారం”ను వాడేస్తున్న దిల్ రాజు

ప్రస్తుతం టాలీవుడ్ లో అందరి దృష్టి త్వరలో రిలీజ్ కానున్న “మంగళవారం” అనే చిన్న సినిమా పైనే ఉంది. “ఆర్ఎక్స్ 100” అనే సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ అజయ్ భూపతి ఈ ప్రయోగాత్మకమైన చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ థ్రిల్లర్లో బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్, అజ్మల్ అమీర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సినిమా టీజర్, ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ కాగా, సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో “మంగళవారం” మూవీ బిజినెస్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

“మంగళవారం”మూవీపై ఈ హైప్ క్రియేట్ కాకముందే నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, హర్షిత్ కలిసి నాలుగు కోట్లకు తీసుకున్నారు. అయితే ఇప్పుడు మూవీకి పెరిగిన క్రేజ్ దృష్యా, ఈ చిన్న సినిమా ద్వారా భారీగా లాభం చేకూరనుందట. ఇప్పటికే దిల్ రాజుకు నైజాంలో 49 ఓన్ థియేటర్స్ ఉండగా, మరో 125 వరకు థియేటర్స్ ఆయన హ్యాండోవర్ లోనే ఉన్నాయి. అయితే ఈ “మంగళవారం” సినిమాపై ప్రస్తుతం మంచి బజ్ క్రియేట్ కావడంతో ఈ చిన్న సినిమాను దిల్ రాజు తన బిజినెస్ మాస్టర్ మైండ్ ను ఉపయోగించి. బాగా క్యాష్ చేసుకోబోతున్నారట.

ప్రస్తుతం సినిమాకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు సినిమాను దిల్ రాజు నుంచి భారీ బడ్జెట్ కు కొనాలని ఆలోచిస్తున్నారట. దిల్ రాజు ఈ మూవీ రైట్స్ నాలుగు కోట్లకు సొంతం చేసుకోగా, ఇప్పుడు గనక రీ బిజినెస్ చేస్తే 6 కోట్లకు కొనడానికి కూడా రెడీగా ఉన్నారట. ఇంకేముంది సినిమా రిలీజ్ కూడా కాకుండానే దిల్ రాజు జేబులో రెండు కోట్ల భారీ లాభం పడుతుంది. కానీ దిల్ రాజు మాత్రం మాత్రం ఇంతటి భారీ ఆఫర్ ను పక్కన పెట్టేసి, తానే స్వయంగా రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారట.

- Advertisement -

ఎందుకంటే నైజాంలో 174 థియేటర్లకు పైగా ఆయన చేతిలో ఉండడంతో, షేరింగ్ లెక్కతో కొన్ని థియేటర్స్ ను ఇస్తున్నాడని సమాచారం. దీంతో మూవీ బాగా ఆడితే గనక దిల్ రాజుకు రీ బిజినెస్ కన్నా ఈ షేరింగ్ ప్లాన్ తోనే ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన దిల్ రాజు “మంగళవారం” సినిమాతో బాగానే క్యాష్ చేసుకుంటున్నాడు. కాగా “మంగళవారం” మూవీ నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు