Priyanka Arul Mohan : మహేష్ కు జోడీగా డాన్ బ్యూటీ ?

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో SSMB28 సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను ముగించుకుంది. ఆగష్ట్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ సినిమాను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

స్టార్ నటీ నటులను ఎంపిక చేస్తూ, సినిమాపై అప్పుడే హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం మలయాళ నటుడు పృథ్వి రాజ్ సుకుమారన్ ను ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. తాజా గా ఫిల్మ్ నగర్ లో మరో వార్త వినిపిస్తుంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ ను త్రివిక్రమ్ ఫైనల్ చేశాడట. ఇప్పటికే మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డె ఫిక్స్ అయింది. ఇప్పుడు రెండో హీరోయిన్ గా ఈ యంగ్ బ్యూటీని ఎంపిక చేశారని సమాచారం.

నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత కొన్ని సినిమాలు చేసింది. కానీ, వాటితో పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో కోలీవుడ్ బాట పట్టింది. సూర్యతో ఈటీ, కార్తికేయన్ తో డాన్ సినిమాల్లో నటించింది. డాన్ సినిమాతో ప్రియాంక అరుల్ మోహన్ కి గుర్తింపు వచ్చింది.ఇప్పుడు సూపర్ స్టార్ తో ఛాన్స్ రావడంతో తెలుగులో కూడా ఈ భామ క్లిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు