హీరోలు తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు చేయాలని అనుకుంటారు. షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి, తర్వాత ప్రాజెక్ట్ లను సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తారు. అందు కోసం ఒకే సారి రెండు సినిమాల షూటింగ్ లలో పాల్గొటానికీ రెడీ అయిపోతారు. ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఇదే ఫార్ములా ను ఫాలో అవుతున్నారు.
ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లోని “సలార్”, ఇటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ప్రాజెక్ట్ కె” సినిమాల షూటింగ్ లలో పాల్గొని మ్యానేజ్ చేశాడు. ఇప్పుడు యంగ్ హీరో నితిన్ కూడా ఒకే సమయంలో రెండు సినిమాల షూటింగ్ ల్లో పాల్గొనటానికి సై అంటున్నట్టు తెలుస్తుంది.
హ్యాట్రిక్ పరాజయాల తర్వాత నితిన్, “మాచర్ల నియోజకవర్గం” సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఎం.ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీలో ఉప్పెన ఫేం కృతి శేట్టి హీరోయిన్ గా నటిస్తుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీలో నితిన్ కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ, ప్రస్తుతం ఇటలీలో మూడు సాంగ్స్ ను చిత్రీకరించే పనిలో ఉంది. అయితే ఒక్క పాటకు మరో పాట షూటింగ్ మధ్యలో భారీగా గ్యాప్ వస్తుందట. ఈ ఖాళీ సమయం వృథా అవుతుందని అనుకుంటున్నాడట నితిన్. దీంతో నితిన్ – వక్కాంతం వంశీ లో కాంబోలో వస్తున్న సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాడానికి రెడీ అయినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.
వక్కాంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పెళ్లి సందD ఫేం శ్రీలీలను హీరోయిన్ గా ఎంచుకున్నారు. కాగ నితిన్ – శ్రీ లీల పై రెండు పాటలను ఇటలీలోనే చిత్రీకరించనున్నారట. అందు కోసం డైరెక్టర్ తో పాటు కొరియోగ్రాఫర్, కెమెరామెన్ ఇప్పటికే ఇటలీకి చేరుకున్నారని విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం. కాగా, నితిన్ ఏ మాత్రం టైమ్ వేస్ట్ చేయకుండా చేస్తున్న సినిమాలు ఇప్పటిలాగే బాక్సాఫీస్ ముందు బోల్తాపడుతాయో, లేదా మంచి విజయాలను నమోదు చేస్తాయో చూాడాలి మరి.