Mrunaal Thakur: ఛాన్స్ ల కోసం ఇలా చేస్తుందా ?

Mrunaal Thakur: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది హీరోయిన్ వస్తూనే ఉన్నారు. కానీ అందులో కొంతమంది మాత్రమే తొందరగా సక్సెస్ అవుతున్నారు. అలాంటి వారిలో మృనాల్ ఠాకూర్ ఒకరు. మృనాల్ ఠాకూర్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. “సీతారామం” సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును తెచ్చుకుంది ఈ అందాల భామ. మొదటి సినిమాతోనే సూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకొని వరుస సినిమాలతో ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. సీతామహాలక్ష్మి పాత్రలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర అయింది.

ఆ సినిమా అనంతరం నాని నటించిన “హాయ్ నాన్న” సినిమాలో అద్భుతమైన పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇప్పుడు తాజాగా విజయ్ దేవరకొండ సరసన “ఫ్యామిలీ స్టార్” అనే సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మృణాల ఠాకూర్ ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ…. తన తదుపరి చిత్రం, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. అంతేకాకుండా “తాను ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి లవ్ స్టోరీ ఉన్న సినిమా కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పుకొచ్చింది. హిందీలో చాలా సినిమా ఆఫర్స్ వస్తున్నాయని, కానీ మంచి ప్రేమ కథలు ఉన్న సినిమాలు రావడం లేదని, మంచి ప్రేమ కథ సినిమాలు చేయాలని ఉంది.

కానీ నాకు రొమాంటిక్, లవ్ స్టోరీస్ ఉన్న సినిమాలు రావడం లేదు. నాకు అర్థం కావడం లేదు….నన్ను నేను నిరూపించుకోవడానికి ఇంకా ఎంతగా ప్రయాసపడాలో…. బహుశా నేను హిందీలో ఇంకా అంతగా ఫేమస్ కాలేదేమో…. కానీ నాకు అక్కడ మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. రొమాంటిక్ మరియు లవ్ స్టోరీస్ ఎక్కువగా చేయాలని అనుకుంటున్నాను అని ఓపెన్ అయిపోయింది ఈ బ్యూటీ.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు