Aha: మళ్ళీ ఆన్ స్క్రీన్ పై రొమాన్స్ కి రెడీ అయిన పవిత్ర-నరేష్ ! మళ్ళీ పెళ్లి పార్ట్ 2 నా.. ?

తెలుగు రాష్టాలలో సంచలనం రేపిన పవిత్ర- నరేష్ ప్రేమాయణం గురించి అందరికి తెల్సిందే. విజయ నిర్మల, సూపర్ స్టార్ కృష్ణ ల నటవారసుడిగా పలు చిత్రాలలో హీరోగా నటించిన సీనియర్ యాక్టర్ నరేష్ ప్రస్తుతం టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా సినిమాలు చేస్తోన్న విషయం అందరికి తెలిసిందే. ఈ తరుణంలోనే ఆయనలాగే ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న పవిత్ర లోకేష్ తో ప్రేమలో పడ్డారు.

అయితే ఈ ప్రేమ ఏదో వీళ్లిద్దరు యంగ్ ఏజ్ లో పుడితే ఇంత సంచలనం అయ్యుండేది కాదేమో కానీ దాదాపు ఇద్దరి వయసు 60 ఏళ్ళు ఉండగా వీరు ప్రేమలో పడటంతో మరియు పైగా అందులోను ఇద్దరికీ పెళ్లిళ్లు కూడా అయ్యి పాతికేళ్ల వయసున్న పిల్లలుండటంతో ఈ లేటు వయసు ప్రేమ కథ రచ్చకెక్కింది.

ఇటీవలనే ఈ ముదురు వయసు లేత ప్రేమికులు, వీళ్ళ ప్రేమకథని మళ్ళీ పెళ్లి పేరుతో సినిమాగా కూడా తీశారు. ప్రముఖ ప్రొడ్యూసర్ యంయస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలనే విడుదలై ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే సినిమాకి ముందు పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేసిన ఈ లవ్ కపుల్ కి ప్రేక్షకులు, సినిమా రిజల్ట్ తో షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. మంచి అంచనాల మధ్య రిలీజైన మళ్ళీ పెళ్లి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయం చెందింది.

- Advertisement -

ఇక విషయానికొస్తే ఈ జంట మళ్ళీ వీళ్లా రొమాన్స్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. అంటే..మళ్ళీ ఇంకో సినిమా చేయబోతున్నారా అని అనుకుంటే పొరపాటే అసలు విషయం ఏంటంటే ఈ జంట నటించిన మళ్ళీ పెళ్లి సినిమా ఈ నెల 23 నుంచి ఓటిటిలో రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ఆహా తీసుకోగా ఇటీవలనే టెలికాస్ట్ డేట్ ని లాక్ చేసినట్టు టాక్. మరి థియేటర్ అపజయం అందుకున్న ఈ జంట ప్రేమ కథ ఓటిటిలో ఎంత వరకు మెప్పింస్తుందో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు