Sankranthi movies: ఈ సినిమాలు సంక్రాంతి వల్ల సేఫ్ అయ్యాయని తెలుసా..!

టాలీవుడ్ లో అతిపెద్ద సినిమా సీజన్ ఏది అంటే ముందుగా చెప్పేది సంక్రాంతి సీజన్. ప్రతి ఏడాది ఈ పండక్కి పందెం కోళ్లలా సంక్రాంతి సినిమాలు కూడా థియేటర్లలో పోటీ పడతాయి. అందులో పెద్ద చిన్నా అని కాకుండా అన్ని రకాల సినిమాలు రిలీజ్ అవుతాయి. ఇక వీటిలో కొన్ని సినిమాలు సంక్రాంతి విన్నర్లు గా నిలిస్తే, మరి కొన్ని పండగ వల్లే బ్రేక్ ఈవెన్ అయ్యి గట్టెక్కాయి. మరి కొన్ని యావరేజ్ అవ్వాల్సిన సినిమాలు కూడా పోటీ లేక సంక్రాంతి విజేతగా నిలిచిన సినిమాలున్నాయి. అలాగే ఈ ఇయర్ కూడా భారీ పోటీలో రిలీజ్ అయిన “గుంటూరు కారం” ప్రేక్షకుల నుండి నెగిటివ్ టాక్ తెచ్చుకోగా, కేవలం పండగ అడ్వాంటేజ్ వల్ల ప్లాప్ కాకుండా అబౌ యావరేజ్ బయటపడింది. అలా గత పదేళ్లలో సంక్రాంతి వల్ల సేఫ్ అయిన కొన్ని సినిమాలపై ఓ లుక్కేద్దాం..

1. బిజినెస్ మ్యాన్ 2012

Business Man 2012

- Advertisement -

2012 లో సంక్రాంతి కి రిలీజ్ అయిన బిజినెస్ మ్యాన్ భారీ అంచనాలతో రిలీజ్ అవగా, ముందు నెగిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. అయితే సంక్రాంతి సీజన్ వల్ల భారీ ఓపెనింగ్స్ దక్కించుకోగా, పోటీగా వచ్చిన సినిమా బాడీ గార్డ్ కూడా యావరేజ్ గా ఉండడంతో ఈ సినిమా గట్టెక్కింది.

2. నాయక్ 2013

Nayak 2013

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన నాయక్ సినిమా 2013 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందన తెచ్చుకోగా, మాస్ సినిమా కావడం అందునా సంక్రాంతి కి విడుదలవగా సినిమా బ్లాక్ బస్టర్ అయింది. పైగా దీనికి పోటీగా రిలీజ్ అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాని కూడా తట్టుకుని నాయక్ భారీ విజయం సాధించింది.

3. ఐ 2014

I 2014

చియాన్ విక్రమ్ హీరోగా శంకర్ షణ్ముగం దర్శకత్వం వహించిన ఈ సినిమా 2014 సంక్రాంతి కి విడుదలై యావరేజ్ గా నిలిచింది. ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా, పండగ అడ్వాంటేజ్ వల్ల, పోటీగా కూడా పెద్దగా సినిమాలు లేకపోవడం వల్ల సేఫ్ అయింది.

4. నాన్నకు ప్రేమతో 2016

Nannaku prematho 2016

ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేయగా, 2016 లో రిలీజ్ అయ్యి మిక్సడ్ రెస్పాన్స్ ని దక్కించుకోగా, సంక్రాంతి వల్ల యావరేజ్ గా నిలిచింది. అయితే దీనికి పోటీగా రిలీజ్ అయిన నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన లాంగ్ రన్ లో ఆడి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

5. శతమానం భవతి 2017

Shathamanam Bhavathi

సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా 2017 లో పెద్ద సినిమాలకు పోటీగా రిలీజ్ అయినా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో రొటీన్ టాక్ తెచ్చుకున్నా, లాంగ్ రన్ లో సేఫ్ అయింది.

6. జై సింహ 2018

Jai simha 2018

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాను కె. ఎస్. రవికుమార్ డైరెక్ట్ చేయగా సంక్రాంతి కానుకగా 2018 లో రిలీజ్ అయింది. అయితే ఆ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయిన అజ్ఞాతవాసి డిజాస్టర్ కావడంతో, పోటీగా మరో సినిమా కూడా లేకపోవడంతో జై సింహ యావరేజ్ గా ఆడింది.

7. ఎఫ్2 2019

F2

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ మల్టీ స్టారర్ 2019 లో రిలీజ్ అయ్యి అనూహ్యంగా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. సంక్రాంతికి రిలీజ్ అయిన భారీ సినిమా “వినయ విధేయ రామ” నెగిటివ్ టాక్ తో ప్లాప్ అవగా, ఎన్టీఆర్ కథానాయకుడు కూడా డిజాస్టర్ అయింది. దీంతో అసలే అంచనాలు లేకుండా వచ్చిన ఎఫ్2 సేఫ్ అవ్వడమే కాకుండా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

8. సరిలేరు నీకెవ్వరూ 2020

Sarileru neekevveru 2020

అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2020 లో రిలీజ్ అవగా మిక్సడ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. అయినా ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ దక్కించుకుని పండగ అడ్వాంటేజ్ తో హిట్ అయింది. అయితే ఆ ఏడాది సంక్రాంతి విన్నర్ గా మాత్రం అలవైకుంఠపురంలో నిలిచింది.

9. రెడ్ 2021

Red 2021

రామ్ పోతినేని డబుల్ రోల్ చేసిన ఈ మూవీకి కిషోర్ తిరుమల దర్శకుడు. 2021 సంక్రాంతి కి రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ డే నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా సంక్రాంతి సీజన్ వల్ల అబో యావరేజ్ గా నిలిచింది.

10. వీర సింహారెడ్డి 2023

Veera simhareddy 2023

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయగా లాస్ట్ ఇయర్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అవగా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయినా సంక్రాంతి పోటీవల్ల భారీ ఓపెనింగ్స్ దక్కించుకోవడం వల్ల యావరేజ్ గా నిలిచింది. పైగా బాలకృష్ణ ఫామ్ లో ఉండడం వల్ల పోటీగా చిరు సినిమా కూడా ఉండడం వల్ల పరువు కోసం కూడా నందమూరి అభిమానులు ఆడించారని ఒక రూమర్ ఉంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు