Lal Salaam OTT : ఆ 21 రోజుల ఫుటేజ్… లాల్ సలాం ఓటీటీ రిలీజ్ లో మార్పు

Lal Salaam OTT : భారీ అంచనాల మధ్య రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన లాల్ సలాం మూవీకి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక పాత్ర పోషించినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద అంచనాలను అందుకోవడంలో ఈ మూవీ పూర్తిగా ఫెయిల్ అయ్యింది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించగా, ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ గురించి రజనీకాంత్ అభిమానులు వేచి చూస్తున్నారు. కానీ థియేటర్లలోకి వచ్చి రెండు నెలలు గడిచిపోతున్నప్పటికీ ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ మాత్రం లేట్ అవుతూనే ఉంది. తాజాగా లాల్ సలాం మూవీ ముందుగా రైట్స్ ను దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ లో కాకుండా మరో కొత్త ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుందని వార్త వచ్చింది. మరి ఇంతకీ లాల్ సలాం మూవీ ఓటిటి రిలీజ్ విషయంలో ఏం జరుగుతోంది? దీనంతటికీ ఆ 21 రోజుల ఫుటేజ్ కామెంట్సే కారణమా? అనే వివరాల్లోకి వెళితే…

నెట్ ఫ్లిక్స్ కాదు సన్ నెక్స్ట్…

లాల్ సలాం మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ముందుగా నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. కానీ తాజాగా ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ నెట్ ఫ్లిక్స్ నుంచి సన్ నెక్స్ట్ ప్లాట్ ఫామ్ కు మారినట్టు సమాచారం. ఏప్రిల్ 12న సన్ నెక్స్ట్ ఓటిటిలో లాల్ సలాం మూవీ స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఇలా మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ మారడం వెనక డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ కామెంట్స్ పెట్టిన కారణం అని తెలుస్తోంది.

21 రోజుల ఫుటేజ్ కామెంట్స్ పెట్టిన చిచ్చు…

రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో లాల్ సలాం షూటింగ్ టైంలో 21 రోజుల ఫుటేజ్ మిస్ అయ్యిందని, కథలో చేసిన మార్పుల కారణంగానే ఈ సినిమాపై ఎఫెక్ట్ పడిందని ఐశ్వర్య చెప్పుకొచ్చింది. దీంతో నెట్ ఫ్లిక్స్ ఈ మూవీని స్ట్రీమింగ్ చేయడానికి ముందే షూటింగ్ టైంలో మిస్ అయిన ఆ 21 రోజుల ఫుటేజ్ ఇవ్వాలని డైరెక్టర్ ఐశ్వర్యను డిమాండ్ చేసిందని టాక్ నడుస్తోంది. ఈ విభేదాలు నేపథ్యంలోనే నెట్ ఫ్లిక్స్ నుంచి లాల్ సలాం మూవీ సన్ నెక్స్ట్ కు మారిందని తెలుస్తోంది.

- Advertisement -

ముచ్చటగా మూడవసారి…

విష్ణు విశాల్, విక్రాంత్ “లాల్ సలాం” మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో మతకలహాల అంశం ప్రధానంగా రూపొందిన ఈ మూవీతోనే చాలాకాలం విరామం తర్వాత దర్శకురాలిగా ఐశ్వర్య రీఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ మూవీ మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రజనీకాంత్ కు లాల్ సలాం మూవీతో ఆయన కెరీర్ లోనే ఇదివరకు ఎన్నడూ చూడని దారుణమైన డిజాస్టర్ ను చూడాల్సి వచ్చింది. ఇక ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ గురించి రోజుకో వార్త బయటకు వస్తోంది. ముందుగా మార్చి 8న నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వస్తుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత మార్చి 21 అన్నారు. తాజాగా ఏప్రిల్ 12 అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు