Neha Shetty: రాధికను రమ్మంటూ టార్చెర్ చేస్తున్న కోలీవుడ్ హీరో ?

నేహా శెట్టి.. ఈ పేరుకంటే రాధిక అని పిలిస్తేనే జనాలందరికి బాగా గుర్తొస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఎందుకంటే ఈ హీరోయిన్ “డీజే టిల్లు” చిత్రంతోనే అంతలా ఫేమస్ అయ్యిందని చెప్పాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు ఉన్న హీరోయిన్లలో నేహా శెట్టి కూడా ఒకరని చెప్పుకోవచ్చు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన “మెహబూబా” చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నేహా. ఆ తర్వాత సందీప్ కిషన్ తో గల్లీ రౌడీ మూవీలో నటించింది.

కానీ ఈ ముద్దుగుమ్మ డీజే టిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువైంది. ఈ సినిమా తర్వాత నేహకు మంచి ఫాలోయింగ్ ఏర్పడి తెలుగులో వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. ఇటీవల కార్తికేయ కు జోడిగా బెదురులంక 2012 సినిమాతో మరో హిట్ అందుకుంది. ఆ తర్వాత రూల్స్ రంజన్ సినిమాలో నటించింది. ఇక ప్రస్తుతం విశ్వక్ సేన్ సరసన గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాలో నటిస్తుంది. 1999లో కర్ణాటకలో జన్మించిన నేహా చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి పెంచుకుంది.

అలా కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ శిక్షణ తీసుకొని పలు అందాల పోటీల్లో పాల్గొంది. మిస్ మంగళూరు 2014 విజేతగా, మిస్ సౌత్ ఇండియా 2015 రన్నరప్ గా టైటిల్స్ గెలుచుకుంది. ఆ తర్వాత 2016లో మంగారు మళ్లై 2 చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారింది.

- Advertisement -

ఇదిలా ఉంటే.. ఓ కోలీవుడ్ హీరో…నేహా శెట్టిని టార్చెర్‌ పెడుతున్నాడట. డేట్‌ కావాలని తరచు కోరుతున్నాడట. లేకపోతే ఇండస్ట్రీలో ఛాన్స్ లు రాకుండా చేస్తానని నేహా శెట్టిని టార్చెర్‌ పెడుతున్నాడట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాశంగా మారింది. అయితే నేహా శెట్టిని టార్చెర్ చేస్తున్న ఆ కోలీవుడ్ హీరో ఎవరు అనేది మాత్రం బయటికి రావడం లేదు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు