Karthi : ఇంటర్నేషనల్ టైటిల్ తో..

కోలీవుడ్ స్టార్ హీరో కార్తి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఖైదీ తర్వాత మూడు చిత్రాలు చేసిన కార్తి, ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్, సర్ధార్ వంటి సినిమాలు చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ చిత్రంగా పొన్నియన్ సెల్వన్ వస్తున్న సంగతి తెలిసిందే. రూ. 500 కోట్లతో తెరకెక్కుతున్న ఈచిత్రం ఈ నెల 30వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి కార్తి కి సంబంధించిన పొంగే నది.. పాట విడుదలైంది.

దీని తర్వాత కార్తి సర్ధార్ అనే స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం చేస్తున్నారు. కార్తి డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ చిత్రం అక్టోబర్ లో విడుదల కానుంది. ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాక ముందే, మరో చిత్రానికి కార్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాజు మురగన్ దర్శకత్వంలో కార్తి సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ఈ చిత్రానికి తాజాగా “జపాన్” అనే డిఫరెంట్ టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం అందుతుంది. దీనిపై చిత్ర యూనిట్ త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఈ జపాన్ చిత్రం వైవిధ్యభరితమైన కథతో వస్తున్నట్లు తెలుస్తుంది. అందుకోసం కార్తి తన లుక్ ను కూడా మార్చుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో ఈ చిత్రం అక్టోబర్ నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ సినిమాలో టాలీవుడ్ ప్రముఖ నటుడు, కమెడియన్ సునీల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. విభిన్న టైటిల్ తో ఇప్పుడే అంచనాలు పెంచుకున్న ఈ చిత్రం, విడుదల తర్వాత ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు