Game Changer : ఇలాగైతే దసరాకి కూడా “గేమ్ ఛేంజర్‌” కష్టమే!

Game Changer

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం “గేమ్ ఛేంజర్‌” షూటింగ్ గురించి అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న తీరు చూస్తుంటే అసలు దసరాకు కూడా రిలీజ్ అవుతుందా? అన్నది అనుమానమే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇంతకీ “గేమ్ ఛేంజర్‌” షూటింగ్ ఎక్కడ దాకా వచ్చింది? అంటే…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “గేమ్ ఛేంజర్‌”. ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ ఇదే కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీని భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడో స్టార్ట్ అయిన ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. అసలు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న విషయంపై క్లారిటీ లేకపోవడం, దాని గురించి మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంపై మెగా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా షూటింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఫిలింనగర్ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం మేరకు త్వరలోనే “గేమ్ ఛేంజర్‌” కొత్త షెడ్యూల్ మొదలు కాబోతోంది. జూన్ నాటికి ఈ సినిమాలో హీరోకు సంబంధించిన వర్క్ అంతా పూర్తవుతుంది. అంతటితో మేకర్స్ గుమ్మడికాయ కొట్టేస్తారు అనుకుంటున్నారేమో. అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ జూన్ లోనే పూర్తి కాబోతోంది కానీ, తర్వాత మరో నెల రోజులపాటు మిగిలిన షూటింగ్ ఉంటుందట.

- Advertisement -

ఈ నేపథ్యంలోనే అసలు “గేమ్ ఛేంజర్‌” మూవీ రిలీజ్ దసరాకు సాధ్యమవుతుందా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. నిర్మాత దిల్ రాజు “గేమ్ ఛేంజర్‌” మూవీని 2024 సెప్టెంబర్ లో రిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఏదేమైనా ఈ ఏడాదిలోనే మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక చెర్రీ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచే మరో అప్డేట్ ఏమిటంటే “జరగండి జరగండి” సెట్ మరో ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా ఉంటుందట. కాగా “గేమ్ ఛేంజర్‌” మూవీ పోస్ట్ పోన్ అవుతుందంటూ వచ్చిన రూమర్స్ పై మేకర్స్ ఇప్పటిదాకా స్పందించకపోవడం గమనార్హం. ఇక ఈ మూవీ గురించి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మెగా ఫాన్స్ లో అసహనం మొదలైంది. మేకర్స్ నుంచి ఒక్క అప్డేట్ కూడా రాకపోవడం పట్ల వాళ్లు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి దసరాకైనా “గేమ్ ఛేంజర్‌” రిలీజ్ అవుతుందా అంటే వెయిట్ అండ్ సీ.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు