క‌ళ్యాణ్ రామ్ ఆశ‌ల‌న్ని ‘బింబిసార’ పైనే..!

నంద‌మూరి వంశంలో ఉన్న హీరోలు అంద‌రూ దాదాపు స్టార్ హోదాను అనుభ‌విస్తున్నారు. బాల‌కృష్ణ‌, తారక్ టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో ఉన్నారు. కానీ క‌ళ్యాణ్ రామ్ మాత్రం వెన‌క‌బ‌డిపోయాడు. సాలిడ్ హిట్ కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నాడు ఈ నంద‌మూరి హీరో. వ‌రుస‌గా సినిమాలు చేసినా బాక్సాఫీస్ ముందు బోల్తా ప‌డుతున్నాయి. అత‌నొక్క‌డే, ప‌టాస్, 118 మాత్ర‌మే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. హీరోతో పాటు ప్రొడ్యూస‌ర్ గా హిట్ అందుకోవ‌డానికి ఎదురుచూస్తున్నాడు. ఒక జై ల‌వ‌కుశ మాత్ర‌మే బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇప్పుడు టాలీవుడ్ లో క‌ళ్యాణ్ రామ్ స్ట్రాంగ్ గా నిల‌బ‌డాలంటే.. హీరోగా, నిర్మాత‌గా నిరూపించుకోవాల్సి వ‌స్తుంది.

ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్.. బింబిసార అనే సోషియో ఫాంట‌సీ మూవీ చేస్తున్నాడు. మ‌ల్లిడి వ‌శిష్టుడు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి క‌ళ్యాణ్ రామ్ ప్రోడ్యూసర్ గా ఉన్నాడు. రూ. 40 కోట్లతో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై క‌ళ్యాణ్ రామ్ భారీ హోప్స్ పెట్టుకున్నాడు. మేక‌ర్స్ రిలీజ్ చేసిన పోస్ట‌ర్లు, టీజ‌ర్ ఫ్యాన్స్ లో ఆస‌క్తి పెంచాయి. అయితే ఈ సినిమాతో అయినా.. క‌ళ్యాణ్ రామ్ హీరోగా, నిర్మాత గా క్లిక్ అవుతాడా.. అని నంద‌మూరి ఫ్యాన్స్ అంటున్నారు. ఈ నంద‌మూరి హీరో స్టార్ డ‌మ్ తెచ్చ‌కోవ‌డానికి బింబిసార ఓ మంచి అవ‌కాశం అని సినీ క్రిటిక్స్ కూడా అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాగ ఈ సినిమా ఆగ‌స్టు 5 వ తేదీన విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం భావిస్తుంది. ఈ సినిమా క‌ళ్యాణ్ రామ్ కు ఎంత వ‌ర‌కు ఇమేజ్ తీసుకువ‌స్తుందో వేచి చూడాలి మ‌రి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు