బ‌న్నీ-డార్లింగ్.. హద్దు మీరుతున్న ఫ్యానిజం

ప్ర‌తి హీరో న‌ట‌న‌కు, చేసే మంచి ప‌నుల‌కు అభిమానులు ఉండ‌టం కామ‌న్. సీనియ‌ర్ ఎన్టీఆర్ కాలం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు హీరోల‌కు ఫ్యాన్స్ ట్రెండ్ కొన‌సాగుతూ వ‌స్తుంది. గ‌తంలో త‌మ అభిమాన హీరోల పుట్టిన రోజుల‌కు ర‌క్త‌దానం, అన్న‌దానం వంటి కార్య‌క్ర‌మాల‌కే ప‌రిమితం అయ్యే వారు. కానీ ప్ర‌స్తుత కాలంలో ఫ్యాన్ క‌ల్చ‌ర్ మారింది. త‌మ హీరోల కోసం రక్త దానాలు కాకుండా.. ర‌క్తాల‌ను క‌ళ్ల చూసుకునే వార్ ప‌రిస్థితులు వ‌స్తున్నాయి. సోషల్ మీడియా వేదిక‌గా.. త‌మ హీరో గొప్ప అంటే.. త‌మ హీరో గొప్ప అంటూ పోస్టులు పెడుతున్నారు.

అంత‌టితో ఆగ‌కుండా.. ఒక్క‌రిపై ఒక్క‌రు వ్య‌క్తిగత దూష‌ణ‌లు చేసుకుంటున్నారు. ఇత‌ర హీరోల‌ను కించ ప‌రుస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ప్రజెంట్ అల్లు అర్జున్- ప్ర‌భాస్ ఫ్యాన్స్ హ‌ద్దులు దాటుతున్నారు. వీరి మ‌ధ్య వివాదం చిలికి చిలికి గాలివానల మారుతుంది. ట్విట్ట‌ర్, ఇన్‌స్టాగ్రామ్, ఎఫ్‌బీ.. ఇలా సోషల్ మీడియాల్లో బ‌న్నీ-డార్లింగ్ ఫ్యాన్స్ వార్ కు దిగుతున్నారు.

అస‌లు ఏం జ‌రిగిందంటే.. ప్ర‌భాస్, పూజా హెగ్డే జంటగా ఇటీవ‌ల పాన్ ఇండియా సినిమా రాధే శ్యామ్ వ‌చ్చింది. బాహుబ‌లి సినిమాల‌తో ప్ర‌భాస్ ప్ర‌పంచ వ్యాప్త గుర్తింపు తెచ్చుకోవ‌డంతో.. ఈ సినిమా అదే రేంజ్ లో ఉంటుంద‌ని అనుకున్నారు. విడుద‌ల‌కు ముందు సాంగ్స్, ట్రైల‌ర్ తో భారీ అంచ‌నాలే పెరిగాయి. విడుదల త‌ర్వాత రాధే శ్యామ్ నెగెటివ్ టాక్ తెచ్చుకుంది.

- Advertisement -

అయితే ఈ సినిమా ఐరెన్ లెగ్ పూజా హెగ్డే వల్లే ఇలా అయిందంటూ డార్లింగ్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేశారు. ఈ పోస్టుల‌కు బ‌న్నీ ఫ్యాన్స్ కౌంట‌ర్ ఇస్తున్నారు. కాగ అల్లు అర్జున్ తో బుట్ట‌బొమ్మ చేసిన దువ్వాడ జ‌గ‌న్నాథం, అల వైకుంఠ‌పురంలో సినిమాలు మంచి హిట్స్ అందుకున్నాయి. పూజా వ‌ల్ల కాదు.. ప్ర‌భాస్ వ‌ల్లే రాధేశ్యామ్ కు నెగెటివ్ టాక్ వ‌చ్చింద‌ని బ‌న్నీ ఫ్యాన్స్ వాద‌న. ట్విట్ట‌ర్ లో మొద‌లైన ఈ వార్.. ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా స్టార్లుగా ఎదుగుతున్న అల్లు అర్జున్, ప్ర‌భాస్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంద‌ని సినీ క్రిటిక్స్ అంటున్నారు. కాగ ఈ వివాదం ఎలాంటి ప‌రిస్థితుల‌కు దారి తీస్తుందో చూడాలి మ‌రి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు