Extra ordinary man: నితిన్ – శ్రీలీల మధ్య ఈ తేడా గమనించారా..?

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ లీల, ప్రముఖ హీరో నితిన్ కలిసి తాజాగా నటిస్తున్న చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.. ఈ సినిమా విడుదలకు కేవలం కొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. 2023 సంవత్సరం డిసెంబర్ 8వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో సినిమాలోని నటీనటులకు సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీ లీల , నితిన్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంత అన్న విషయం ఇప్పుడు మరింత వైరల్ గా మారింది.

అసలు విషయంలోకెళితే తాజాగా మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో ఆదికేశవ సినిమా తీసి.. తన ఖాతాలో ఫ్లాప్ ను వేసుకుంది శ్రీ లీల. ఇక నితిన్ సినిమాతో నైనా సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాల్సి ఉంది. ఇక మరొకవైపు నితిన్, శ్రీ లీల మధ్య ఏకంగా 18 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న నితిన్ పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఇదిలా ఉండగా గత కొన్ని సంవత్సరాలుగా ఆంజనేయ స్వామి మాల వేసుకుని కనిపిస్తున్న నితిన్.. ఈసారి కూడా స్వామి మాల వేసుకొని సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఇక అందులో భాగంగానే ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ఫుల్ లెన్త్ ఎంటర్టైనర్ చిత్రమని నితిన్ తెలిపారు.

అంతేకాదు ఈ సినిమా కడుపుబ్బా నవ్విస్తుందని ఇప్పటివరకు ఇలాంటి కామెడీ మీరు చూసి ఉండరు అంటూ కామెంట్లు చేశారు నితిన్..ఇకపోతే అటు సినిమా గురించి ఇటు తనకు శ్రీ లీలకు మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ గురించి వెల్లడించి అందరిని ఆశ్చర్యపరిచారు. వాస్తవానికి ఇలా హీరోలకు , హీరోయిన్లకు మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే . ఇప్పటికే బాలయ్యతో అటు చిరంజీవితో చాలామంది యంగ్ హీరోయిన్లు జతకట్టారు. ఇక వీరికి వారికి మధ్య కూడా వయసు తేడా చాలా ఎక్కువగానే ఉండేది. ఈ క్రమంలోనే అటు నితిన్ ఇటు శ్రీ లీల మధ్య కూడా ఈ ఏజ్ గ్యాప్ ఉండడంతో కొంతమంది లైట్ తీసుకుంటున్నారు. ఇకపోతే ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ తో వస్తున్న నితిన్ ఈసారి ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు