Fighter: స్ట్రాటజీ బ్యాక్ ఫైర్… హృతిక్ సినిమాకి రిలీజ్ కు ముందే దెబ్బ

Fighter: గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, దీపికా పదుకొనే జంటగా నటించిన ఏరియల్ యాక్షన్ మూవీ “ఫైటర్”. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న థియేటర్లలోకి వచ్చేసింది. అయితే ఈ సినిమాకు రిలీజ్ కాకముందే దాదాపు 60 కోట్ల భారీ నష్టం జరిగినట్టు సమాచారం. దానికి కారణం గల్ఫ్ దేశాల్లో ఈ మూవీ బ్యాన్ కావడమే.

“ఫైటర్” సినిమాను యూఏఈ తో సహా గల్ఫ్ దేశాలు అన్నింటిలోనూ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. జనవరి 10న జిసిసి సెన్సార్ నుండి క్లియరెన్స్ పొందడంలో “ఫైటర్” మూవీ విఫలమైంది. ఫలితంగా యూఏఈ లోని అన్ని చైన్‌ల నుండి ఈ సినిమాను తీసేశారు. ట్రైలర్ ను బట్టి చూస్తే ఈ చిత్రంతో జాతీయ వాదం అనే ఎమోషన్ ను ఉపయోగించుకోవాలని మేకర్స్ ప్లాన్ చేసినట్టు అనిపిస్తోంది. రీసెంట్ గా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన “గదర్” తరహాలోనే భారత్, పాకిస్తాన్ మధ్య వైరం నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది.

అయితే ఇలాంటి సినిమాలను సాధారణంగానే గల్ఫ్ రూల్స్ ప్రకారం అక్కడ నిషేధిస్తారు. ఇలా సినిమాలో పాకిస్తాన్‌తో గొడవ కారణంగా “ఫైటర్” మేకర్స్ వ్యూహం బెడిసి కొట్టినట్టుగా అయింది. అయితే యూఏఈ సహా గల్ఫ్ దేశాల్లో ఈ సినిమాపై బ్యాన్ విధించడం వల్ల కనీసం 60 నుంచి 80 కోట్ల వరకు భారీ నష్టం జరుగుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

ఇక “ఫైటర్” మేకర్స్ ను నిరుత్సాహపరిచే మరో విషయం ఏమిటంటే… భారత్, పాకిస్తాన్ వంటి ఇంట్రెస్టింగ్ అంశాలతో ఈ సినిమా రూపొందినప్పటికీ భారతీయ ప్రేక్షకులు కూడా ఈ మూవీ పై పెద్దగా ఆసక్తి చూపకపోవడం. విజువల్స్ పరంగా ఈ సినిమా బాగానే ఉన్నప్పటికీ పేలవమైన సంగీతం, బోరింగ్ స్టోరీ ప్లాట్ కారణంగా “ఫైటర్ “పై ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, ఆశించిన విధంగా ఆక్యుపెన్సి లేకపోవడం హృతిక్ ఫ్యాన్స్ కు షాక్ ఇస్తోంది.

ఇక రిపబ్లిక్ డే కలిసి వస్తుంది కాబట్టి దేశభక్తి నేపథ్యంలో రూపొందిన “ఫైటర్” మూవీకి రానున్న రెండు రోజుల్లో కలెక్షన్లు, ఆక్యుపెన్సి కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ మూవీ తెలుగులో రిలీజ్ అవుతుంది అన్న విషయం చాలామందికి ఇంకా తెలియదు. ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ పెద్దగా కాన్సెంట్రేట్ చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం. మరి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ “ఫైటర్” గట్టెక్కుతుందా ? అంటే వీకెండ్ పూర్తయ్యేదాకా ఎదురు చూడాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు