Tripti Dimri: “యానిమల్”లో బెడ్ రూమ్ సీన్స్ కోసం ఈ బ్యూటీ ఎంత ఛార్జ్ చేసిందో తెలుసా?

మోస్ట్ వైలెంట్ మూవీ “యానిమల్” మూవీతో థియేటర్లలో ప్రేక్షకులను పిచ్చెక్కించి నేషనల్ క్రష్ గా మారిపోయింది బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రి. మరి ఈ హాట్ సీన్లలో నటించడానికి ఆమె ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది? ఏకంగా బెడ్ రూమ్ సీన్లలో కనిపించడానికి ఈ భామ ఎంత ఛార్జ్ చేసింది? అనే వివరాల్లోకి వెళితే…

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న “యానిమల్” మూవీలో హీరో హీరోయిన్ల కంటే ఎక్కువ క్రేజ్ వచ్చింది తృప్తికే. రణబీర్ కపూర్ తో ఈ భామ చేసిన కొన్ని హాట్ సీన్లు ప్రేక్షకులను బాగా తృప్తి పరచడంతో ఈ బ్యూటీ రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్ట్ గా మారిపోయింది. అయితే ఈ సినిమా కోసం ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ భారీగా ఉంటుందేమో అనుకుంటున్నారేమో. అయితే మీరు తప్పులో కాలేసినట్టే.

యానిమల్ మూవీలో తృప్తి జోయా అనే పాత్రలో నటించింది. సినిమాలో ఆమె కనిపించింది తక్కువ సీన్ లోనే అయినా, ఆ బెడ్ రూమ్ సన్నివేశాలను మాత్రం థియేటర్ బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులు మర్చిపోలేక పోతున్నారు. ముఖ్యంగా ఈ మూవీ తర్వాత యూత్ కు తృప్తి కలల రాణిగా మారిపోయింది. అయితే తాజాగా ఆ పాత్ర కోసం తృప్తి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత అనే విషయం బయటకు వచ్చింది. ఈ మూవీ కోసం తృప్తి కేవలం 40 లక్షలు మాత్రమే తీసుకుందట. ఇది నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచే విషయమే. కానీ అదే నిజం. ఈ మూవీకి ఆమె తక్కువ పారితోషకం తీసుకుంటేనేం పాపులారిటీ మాత్రం ఆకాశాన్ని తాకింది. తాజాగా అయ్యింది రిలీజ్ చేసిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్ లో తృప్తి టాప్ ప్లేస్ లో ఉండడమే అందుకు నిదర్శనం.

- Advertisement -

నిజానికి యానిమల్ మూవీ కంటే ముందే తృప్తి పలు బాలీవుడ్ సినిమాల్లో కనిపించినప్పటికీ, చాలామంది హిందీ ప్రేక్షకులకు సైతం ఈ అమ్మడు పెద్దగా పరిచయం లేదు. కానీ ఈ మూవీ తర్వాత ఒక్కసారిగా ఆమె రేంజ్ పెరిగిపోయింది. ఈ మూవీ తర్వాత ఆమెకు ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 30 లక్షల ఫాలోవర్లు పెరిగారు. యానిమల్ రిలీజ్ కు ముందు కేవలం ఆరు లక్షలు మాత్రమే ఉన్న ఫాలోవర్లు, డిసెంబర్ 14 నాటికి ఏకంగా 37 లక్షలకు చేరుకోవడం విశేషం అని చెప్పాలి. అంతేకాకుండా ఈ మూవీ తర్వాత తృప్తికి ఆఫర్ల వెల్లువ స్టార్ట్ అయిందని అంటున్నారు. మొత్తానికి చేసింది చిన్న పాత్ర అయినా అది ఆమె ఫేట్ ను మార్చేసింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు