Pawan Kalyan: హరి హర వీర మల్లుకి బ్రేక్ పడిందా.?

సక్సెస్
ఫెయిల్యూర్
డబ్బు రావడం
డబ్బు పోవడం ఇండస్ట్రీలో కామన్ థింగ్,
ఇక్కడ నిలబడమే ఇంపార్టెంట్.

ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన నిర్మాత ఏ.ఎమ్ రత్నం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఆయన నిర్మించిన ఖుషి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఒక రీమేక్ ఫిల్మ్ కూడా ఇంత అద్భుతంగా తియ్యొచ్చ్చు అనడానికి ఖుషి సినిమా ఒక నిదర్శనం. ఏ.ఎం.రత్నం ఖుషి సినిమా తరువాత మళ్ళీ పవన్ కళ్యాణ్ కి నిర్మాతగా చేసిన సినిమా “బంగారం”, కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

ఎట్టకేలకు ఈ కాంబినేషన్ మళ్ళీ సెట్ అయి “హరి హర వీరమల్లు” చేస్తుంది. ఈ సినిమాకి జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.
గమ్యం సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన క్రిష్ జాగర్లమూడి. కొన్ని విభిన్నమైన సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నాడు. అటువంటి క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో మన ఊహకు కూడా అందవు.

- Advertisement -

ఆల్రెడీ ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా ఫస్ట్ లుక్ & టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ పీరియాడిక్ సినిమా “హరిహర వీరమల్లు” ను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

మరి దాదాపు 60% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కాస్త నెమ్మదిగానే కొనసాగుతుంది అని చెప్పాలి. బడ్జెట్ ప్రాబ్లెమ్ వలన, ఆర్టిస్ట్ లు డేట్స్ దొరక్కపోవడం వలన ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంలో ఇప్పటివరకు సరైన క్లారిటీ అయితే లేదు. ఎన్నో ట్రెండ్ సెట్టింగ్ ఫిలిమ్స్ నిర్మించిన ఏ.ఎం. రత్నం ఈ సినిమాతో నిలద్రొక్కుకుంటారేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు