People Media Factory: స్నేహం చెడిందా.? 100 సినిమాలు సాధ్యమేనా.?

ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంతా ఈజీ పని కాదు. ముఖ్యంగా ప్రొడ్యూసర్లుగా నిలబడటం అయితే మరీ కష్టం. నాలుగు సినిమాలు హిట్ అయి… ఒక్క సినిమా డిజాస్టార్ అయినా, పరిస్థితి మొదటికి వస్తుంది. నిజానికి ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లుగా మారుదామని వచ్చి ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదుర్కొని, కనబడకుండా పోయిన వాళ్ల సంఖ్య ఎక్కువే ఉంటుంది.

కానీ, వీటి అన్నింటినీ ఎదుర్కొని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసింగ్ కంపెనీగా ఎదిగింది. తక్కువ కాలంలోనే 100 సినిమాలు నిర్మిస్తామని ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్ చెప్పుకొస్తున్నాడు. అయితే ఈ టార్గెట్ రీచ్ అవ్వక ముందే చాలా సమస్యలను ఎదుర్కొంటుంది. పీపుల్స్ మీడియాలో ప్రొడ్యూసర్లు టీ జీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనేలా గొడవలు జరుగుతున్నాయట.

దీనికి కారణం లేకపోలేదు. ఈ ఏడాది స్టార్టింగ్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. దీంతో కోట్లల్లో నష్టపోయారు. దీని గురించే ఈ ప్రొడ్యూసర్ల మధ్య గొడవ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. రోజులు గడుస్తున్న కొద్ది… వివాదం కూడా ముదురుతుందట. దీంతో పీపుల్స్ ఓనర్ విశ్వ ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అయితే వివేక్ కూచిభొట్ల కూడా సొంత కుంపటి పెట్టుకోవడానికే రెడీగా ఉన్నట్టు అప్పట్లో టాక్ వచ్చింది. దీనికి బలం చేకూరేలా… సప్త సాగరాలు దాటి అనే సినిమా తెలుగు రైట్స్ ను విశ్వ ప్రసాద్ కు సంబంధం లేకుండానే తీసుకున్నాడు.

- Advertisement -

దీని తర్వాత విశ్వ ప్రసాద్ కి, వివేక్ కూచిభొట్ల మధ్య వివాదం మరింత పెరిగిందట. దీంతో వివేక్ కూచిభొట్లను పీపుల్స్ నుంచి లెక్క సరి చేసి పంపించేయాలి అని చూస్తున్నారట విశ్వ ప్రసాద్. వివేక్ స్థానంలో విశ్వ ప్రసాద్ కూతురిని పెట్టాలని డిసైడ్ అయినట్టు టాక్. విశ్వ ప్రసాద్ కూతురు కూడా గత కొన్ని రోజుల నుంచి అమెరికాలో ఉన్న తన కంపెనీల కంటే, ఇక్కడ సినిమాల నిర్మాణంపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు.

కొన్ని రోజుల్లోనే ఈ టాప్ ప్రొడ్యూసింగ్ హౌస్ లో చాలా మార్పులు జరగబోతాయన్నది టాక్.

Grab Filmify for the latest web stories on Celebrities, today’s Tollywood news, the latest images of actors & actresses, new movie ratings & reviews, and the latest entertainment news from all Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు